BRS మాజీమంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:06 PM
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటారా.. రేవంత్ రెడ్డి.. మీకు సంస్కారం ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతున్నదని, కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి.. మాట సమర్థించుకుంటున్నారని, కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీ మంత్రి హరీష్ రావు (Ex Minister Harish Rao) కీలక వ్యాఖ్యలు (Key comments) చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP Chief Minister Chandrababu) పాలమూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదని.. కానీ కేసీఆర్ (KCR) 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని అన్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించేందుకు... మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చేపల పులుసు తిన్నందుకు.. ఆంధ్రాకు కృష్ణా జలాలు తరలించారని హరీష్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ వీటిపై చర్చకు రేవంత్‌రెడ్డి సిద్ధమా అంటూ హరీష్‌రావు సవాల్ విసిరారు. కేటీఆర్, తాను పదవుల కోసం పోటీ పడటం లేదన్నారు. శనేశ్వరం వంటి రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించేవరకు... కేసీఆర్‌ను సీఎంను చేసే వరకు పోటీపడి పనిచేస్తామని అన్నారు. 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు పోరాడుతామని హరీష్‌రావు స్పష్ఠం చేశారు.
Also Read..:
అమరావతిపై సీఎం చంద్రబాబు దృఢ సంకల్పం..
కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలి..
కేసీఆర్ జాతిపిత.. అయితే రేవంత్ రెడ్డి బూతు పిత అని.. బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ రేవంత్ రెడ్డిదని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటారా.. రేవంత్ రెడ్డ.. మీకు సంస్కారం ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతున్నదని, కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి మాట సమర్థించుకుంటున్నారని, కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.. రైతు రుణమాఫీ విషయంలో మధిరకు పోదామా.. కొడంగల్ పోదామా.. సిద్దిపేట పోదామా.. ఏ ఊరుకు పోదాం.. సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే ముక్కు నేలకు రాస్తానని.. లేదంటే సీఎం రాయాలని.. ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాగా ఎప్పటిలోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తారో రేవంత్ రెడ్డి చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ తరపున ఏజెంట్‌గా కూర్చుంటే హత్యలు చేస్తారా..
ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
వారికి జీతాలు ఎలా ఇస్తారు: టీడీపీ
For More AP News and Telugu News