Share News

Hyderabad: హైడ్రా ప్రజావాణి.. ఒక్కరోజులో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయంటే..

ABN , Publish Date - Jan 06 , 2025 | 07:54 PM

హైడ్రా ప్రజావాణి (Hydra Prajavani) కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుద్ద భవన్ (Buddha Bhavan) హైడ్రా కార్యాలయంలో ఇవాళ (సోమవారం) ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు.

Hyderabad: హైడ్రా ప్రజావాణి.. ఒక్కరోజులో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయంటే..
Hydra Prajavani

హైదరాబాద్: హైడ్రా ప్రజావాణి (Hydra Prajavani) కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుద్ద భవన్ (Buddha Bhavan) హైడ్రా కార్యాలయంలో ఇవాళ (సోమవారం) ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఇవాళ ఒక్కరోజే ఏకంగా 83 ఫిర్యాదులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ (Hydra Commissioner Ranganath)కు అందాయి. వివిధ జిల్లాల నుంచీ పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో వాటిని స్వీకరించేందుకు అధికారులు నిరాకరించారు. తమ పరిధిలోకి ఆ ప్రాంతాలు రావంటూ వారిని పంపించేశారు. స్వీకరించిన 83 ఫిర్యాదులపై మూడు వారాల్లో చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు.

Hyderabad: బాబోయ్.. దారుణ ఘటన.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు..


హైదరాబాద్ నగరంలో చెరువులు, పార్కులు ఆక్రమించి భవనాలు నిర్మించారంటూ ఎక్కువ శాతం ఫిర్యాదులు అందాయి. మరోవైపు సంక్రాంతి నుంచి హైదరాబాద్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హైడ్రా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంక్రాంతికి పోలీస్ స్టేషన్లు ప్రారంభం అయితే ఇకపై అక్కడ్నుంచే కార్యకలాపాలు నిర్వహించున్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు వంటి ఆక్రమణలపై ఫిర్యాదు చేయాలని భావిస్తే నేరుగా హైడ్రా పోలీస్ స్టేషన్లలోనే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Delhi: మోహన్ బాబు కేసు విచారణలో ట్విస్ట్.. ఆ రోజు విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు..

Hyderabad: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు.. పర్మిషన్ తీసుకోవాల్సిందే..

Updated Date - Jan 06 , 2025 | 07:54 PM