Hyderabad: నో ఏసీ క్యాంపెయిన్ పేరుతో క్యాబ్ డ్రైవర్లు నిరసనకు సిద్ధం
ABN , Publish Date - Mar 23 , 2025 | 09:53 PM
హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు మార్చి 24 నుంచి మరో నిరసనకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నో ఏసీ క్యాంపెయిన్ పేరుతో కార్లలో కస్టమర్లకు ఏసీలను వేయకుండా రైడ్లను నిర్వహిస్తారు. అయితే దీనికి గల కారణాలు ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్‌లో సేవలు అందిస్తున్న ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్లపై క్యాబ్ డ్రైవర్లు మరో నిరసనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయానికి రైడ్స్ బైకాట్ చేసిన డ్రైవర్లు, ఇప్పుడు మార్చి 24 నుంచి "నో ఏసీ క్యాంపెయిన్" పేరిట ఎయిర్ కండిషన్డ్ (AC) రైడ్లను అందించబోమని వెల్లడించారు. ఈ అంశంపై తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) కీలక ప్రకటన చేసింది. క్యాబ్ అగ్రిగేటర్ల అన్యాయమైన ధరల విధానాన్ని నిలిపివేయాలని, ఇకపై తమకు న్యాయమైన ధరల విధానాన్ని అమలు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.
చెల్లింపు విషయంలో అన్యాయం
క్యాబ్ అగ్రిగేటర్లు డిమాండ్ ప్రకారం, రోజువారీ భారం తట్టుకోడానికి ఖర్చుల్ని పెంచేస్తున్నారు. ఇందులో పెరిగిన ఇంధన ధరలు, డ్రైవర్ కమిషన్లు, ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం సహా అనేక అంశాలు ఉంటాయన్నారు. కానీ తమకు అగ్రిగేటర్లు చెల్లించే విషయంలో మాత్రం అన్యాయం జరుగుతుందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో క్యాబ్ అగ్రిగేటర్లు ఎక్కువ కమిషన్ తీసుకొంటున్నారని, అది దాదాపు 30% వరకు ఉంటుందని అంటున్నారు. అలాగే, విమానాశ్రయాల్లో క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ సమయం వేచి ఉండడం వల్ల వచ్చే లోటు, డ్రైవర్ల ఆదాయాన్ని తగ్గిస్తుందని గుర్తు చేశారు.
ఈ కారణంగా ప్రయాణికులు
ఈ ప్రకటన ప్రకారం 24 మార్చి నుంచి Hyderabadలోని క్యాబ్ డ్రైవర్లు.. కార్లలో ఏసీలను వేయడం మానేస్తారు. దీని కారణంగా ప్రయాణీకులు AC సేవలను పొందలేరు. ఈ నిర్ణయం ద్వారా డ్రైవర్లు తమ ఆర్థిక ఇబ్బందులను చెప్పడమే కాకుండా, తమ ఆదాయం పెరిగేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.
కొత్త ధరల డిమాండ్
క్యాబ్ అగ్రిగేటర్ల ధరలు చాలా ఎక్కువగా పెరిగాయి. కానీ తమకు చెల్లించే వేతనాల విషయంలో మాత్రం అన్యాయం జరుగుతుందని డ్రైవర్లు అంటున్నారు. ఈ క్రమంలో TGPWU ఏప్రిల్ నుంచి కొత్త ధరలు అమలు చేయాలని కోరుతోంది. ఈ ధరల ప్రకారం, ఒక్క కిలోమీటరుకు రూ. 10 నుంచి రూ. 12 వరకు డ్రైవర్లు సంపాదిస్తారని, కానీ ఎయిర్ కండిషనర్ ఆన్ చేస్తే, కిలోమీటరుకు రూ.16-18 వరకు ఖర్చు అవుతుందని యూనియన్ తెలిపింది. క్యాబ్ అగ్రిగేటర్లు, ప్రీపెయిడ్ టాక్సీ ఛార్జీలే విధించబడినట్టు, తమ సేవలకు కూడా ఏకరీతి ఛార్జీలు అమలు చేయాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Apple: ఆపిల్ సిరీస్ వాచ్‌లలో క్రేజీ ఫీచర్..కెమెరాలు అమర్చాలని..
Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News