Share News

IT Raids: ఐటీ సోదాలు.. కీలక అంశాలు వెలుగులోకి

ABN , Publish Date - Jan 22 , 2025 | 10:57 AM

IT Raids: మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను ఇన్‌కంటాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. దిల్ రాజ్ (Producer Dil Raju) ఇల్లు, కూతురు హన్సితా రెడ్డి, సోదరుడు నర్సింహ రెడ్డి, నిర్మాత శిరీష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు మూవీల ఆదాయ వ్యయాలపైనా ఐటీ విచారణ చేస్తోంది.

IT Raids: ఐటీ సోదాలు.. కీలక అంశాలు వెలుగులోకి
Tollywood producer Dil raju It raids

హైదరాబాద్, జనవరి 22: టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఐటీ సోదాల్లో (IT Raids) కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్‌లను ఐటీ అధికారులు విచారించారు. పుష్ప 2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలు రాబట్టినట్లు ఐటీ గుర్తించింది. వసూళ్లు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని ఐటీ నిర్ధారణకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను ఇన్‌కంటాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. దిల్ రాజ్ (Producer Dil Raju) ఇల్లు, కూతురు హన్సితా రెడ్డి, సోదరుడు నర్సింహ రెడ్డి, నిర్మాత శిరీష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు మూవీల ఆదాయ వ్యయాలపైనా ఐటీ విచారణ చేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ.203 కోట్లు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. మరోవైపు పుష్ప 2 చిత్ర దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప 2 నిర్మాణంలో సుకుమార్‌కు షేర్లు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.


హైదరాబాద్‌కు హన్సితా రెడ్డి

దిల్‌రాజు కుమార్తె హన్సితా రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రెండు రోజులుగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఐటీ ఆధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వెంటనే హైదరాబాద్ రావాలని దిల్ రాజ్ కూతురుకు ఐటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు. హన్సితా రెడ్డిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. విచారణ ఇప్పటికే ఇంట్లో డాక్యుమెంట్లను ఐటీ స్వాధీనం చేసుకుంది. హన్సిత రెడ్డి నిర్మించిన చిత్రాలకు సంబంధించి ఆదాయ వ్యయాలపై ప్రశ్నిస్తున్నారు. ఈరోజు రాత్రి వరకు ఐటీ సోదాలు కొనసాగునున్నాయి.

కర్ణాటకలో ఘోర ప్రమాదం..


రెండో రోజు కూడా...

కాగా.. హైదరాబాద్‌లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు జరుగుతున్నాయి. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. పుష్ప-2 బడ్జెట్‌, వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీశారు. ఐటీ రిటర్న్స్‌ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న కూడా టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖల నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. మంగళవారం నాడు తెల్లవారుజాము నుంచే ఐటీ దాడులు షురూ అయ్యాయి. మొత్తం ఎనిమిది చోట్ల దాదాపు 55 ఐటీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేసింది. ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Sirish) , దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి ఇళ్లలో సోదాలు జరిగాయి. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్ధకు సంబంధించి మైత్రి నవీన్‌, సీఈఓ చెర్రీ ఇళ్లు, కార్యాలయాలు, వారి భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే దిల్‌ రాజు భార్య తేజస్వినిని తీసుకెళ్లి బ్యాంకు లాకర్లు తెరిపించారు. ఈరోజు మరికొన్ని డాక్యుమెంట్లను వారు పరిశీలిస్తున్నారు. అలాగే ఎస్‌వీసీ ఆఫీస్‌కు దిల్‌ రాజును తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’

New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం మారిన రూల్స్.. ఇలా చేస్తే ఎన్నో ఏళ్ల మీ కల నెరవేరినట్లే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 12:23 PM