Manchu Family Issue: మంచు ఫ్యామిలీ ఇష్యూ.. విచారణకు తండ్రీ, కొడుకులు
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:17 PM
Manchu Family: మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. మనోజ్ తనతో పాటు కీలక డాక్యుమెంట్లను తీసుకొచ్చారు. వీరిద్దరిని సబ్ కలెక్టర్ విచారించనున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మంచు ఫ్యామిలీ (Manchu Family) వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు మంచుమోహన్(Actior Manchu Mohan Babu), మంచు మనోజ్ (Manchu Manoj) సోమవారం నాడు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. నటుడు మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి సబ్‌కలెక్టర్.. ఇద్దరినీ విచారణకు పిలిచారు. ఈ క్రమంలో మోహన్ బాబు, మనోజ్ ఒకరి తర్వాత ఒకరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా తనతో పాటు కీలక డాక్యుమెంట్లను తీసుకొచ్చారు మంచు మనోజ్. వీరిరువురిని సబ్‌కలెక్టర్ విచారించనున్నారు.
మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి సమయంలో కూడా వారి మధ్య గొడవలు మరోసారి బయటపడ్డాయి. అయితే తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ ఖాళీ చేయించాలంటూ రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్‌కు మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జల్‌పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. ప్రస్తుతం జల్‌పల్లిలోని ఇంట్లో మంచు మనోజ్ నివాసం ఉండగా.. మోహన్ బాబు తిరుపతిలో ఉంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్ ఆక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు.
లావణ్య, రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి 200కుపైగా వీడియోలు
అలాగే పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్నారు కలెక్టర్. ఈ నోటీసుల మేరకు మనోజ్ ఇప్పటికే రంగారెడ్డి సబ్ కలెక్టర్ ఎదుట విచారణకు తొలిసారి హాజరయ్యారు. తమవి ఆస్తి గొడవలు కాదని, తమ విద్యాసంస్థలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినదుందుకు ఆస్తి గొడవలుగా ప్రచారం చేస్తున్నారని అప్పట్లో మనోజ్ చెప్పారు. కుటుంబసభ్యులు అంతా కూర్చుని మాట్లాడుకుందామని ఎన్నిసార్లు చొప్పినా ఎవరూ కూడా స్పందించడం లేదని మనోజ్ అన్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు రంగారెడ్డి సబ్‌కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు మోహన్ బాబు. అలాగే మనోజ్ కూడా మరోసారి విచారణకు వచ్చారు.
ఇవి కూడా చదవండి..
Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు
Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Read Latest Telangana News And Telugu News