Share News

Rammohan Reddy: జబర్దస్త్ కామిడీ షో లా కేటీఆర్ తీరు

ABN , Publish Date - Jan 10 , 2025 | 02:47 PM

Telangana: మాజీ మంత్రి కేటీఆర్‌పై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల కష్టార్జితం రూ.55 కోట్లు విదేశీ కంపనీకి అప్పగించి లుచ్చా పని చేసింది కేటీఆర్ అంటూ విరుచుకుపడ్డారు. అబద్దాల హరీష్ రావును ఎవరు నమ్మే పరిస్తితిలో లేరన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ మాట్లాడవద్దని హెచ్చరించారు.

Rammohan Reddy: జబర్దస్త్ కామిడీ షో లా కేటీఆర్ తీరు
Parigi MLA Rammohan Reddy

హైదరాబాద్, జనవరి 10: మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) తీరు జబర్దస్త్ కామిడీ షో లా కనిపిస్తోందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి (Parigi MLA Rammohan Reddy) ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏసీబీ విచారణకు వెళ్తూ భయంగా నటించారని.. విచారణ తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్‌ను స్వాతంత్ర సమర యోధుడు అయినట్లు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారన్నారు. కనకపు సింహాసనమైన సీఎం కుర్చీ మీద ఒక్కరోజులో రేవంత్ రెడ్డి కూర్చోలేదన్నారు. అంచలంచెలుగా ఎదిగి అధిష్టానం నిర్ణయంతో సీఎం అయ్యారని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని టీఆర్ఎస్‌కు తాము ఇచ్చామని.. కానీ ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని విమర్శించారు. రెండు లక్షల రైతు రుణమాఫీని ఆరునెలల్లో తమ ప్రభుత్వం చేసిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు కూడా త్వరలో వేయబోతున్నామన్నారు.


పారిశుధ్య కార్మికులకు గ్రీన్ ఛానెల్ ద్వారా జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏడాదికి రూ.12వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆ కార్డు ప్రతీ పథకానికి ఉపయోగపడనుందని తెలిపారు. పేద ప్రజల కష్టార్జితం రూ.55 కోట్లు విదేశీ కంపనీకి అప్పగించి లుచ్చా పని చేసింది కేటీఆర్ అంటూ విరుచుకుపడ్డారు.

తిరుపతి ఘటనకు కారణం ఇదే అన్న మంత్రి


అబద్దాల హరీష్ రావును ఎవరు నమ్మే పరిస్తితిలో లేరన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ మాట్లాడవద్దని హెచ్చరించారు. కేటీఆర్ జైలుకు వెళ్లడం.. చిప్పకూడు తినడం ఖాయమని స్పష్టం చేశారు. ఒకసారి విచారణకు పిలిచి అరెస్టు చేయరని.. కవిత విచారణలో కూడా అదే జరిగిందన్నారు. విచారణలో ప్రభుత్వం తలదుర్చదని.. చట్టం తనపని తాను చేసుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చు.. నష్టం 5 లక్షల కోట్లు

Formula E Case: ఏసీబీ విచారణకు బీఎల్‌ఎన్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 10 , 2025 | 03:17 PM