Davos: తెలంగాణకు భారీ పెట్టుబడులు
ABN , Publish Date - Jan 22 , 2025 | 09:34 PM
Davos: రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాక్ పాట్ కొట్టింది. దావోస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మరో భారీ ప్రాజెక్ట్ ను రేవంత్ సర్కార్ కైవసం చేసుకొంది.
హైదరాబాద్, జనవరి 22: రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సాగుతోంది. అందులోభాగంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో మరో భారీ పెట్టుబడిని తెలంగాణ ప్రభుత్వం సాధించింది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. రూ. 45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రోకెమికల్స్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. దీంతో తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్తు, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
ఈ ప్రాజెక్ట్‌ను నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో అతి భారీ ఒప్పందం ఇదే కావడం గమనార్హం. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుధవారం మరో కీలక ఒప్పందం కుదుర్చుకొంది. రాష్ట్రంలో అధునాతన అన్‌మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (UAV) తయారీ యూనిట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది.
ఈ ప్రాజెక్ట్.. రూ.800 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ప్రకటించింది. జేఎస్‌డబ్ల్యు డిఫెన్స్ అనుబంధ సంస్థ JSW UAV లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుతో డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశముందని చర్చ ఊపందుకొంది. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోంది.
Also Read: బిల్స్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. రియాక్షన్ చూశారా
Also Read:సైబర్ క్రైమ్ బాగా పెరిగింది
ఈ సదస్సు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంతరెడ్డి సారథ్యంలో పలువురు మంత్రులు ఉన్నతాధికారులు దావోస్ బయలుదేరి వెళ్లారు. ఆ క్రమంలో ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. అందుకోసం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రతినిధి బృందం పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: ప్రయాణికులపై నుంచి దూసుకెళ్లిన రైలు: పలువురు మృతి
Also Read: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు జడ్జిలు నియామకం
Also Read: : గడ్డ కట్టే చలిలో సమావేశానికి నడిచి వెళ్లిన మంత్రి నారా లోకేష్
Also Read: రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్
Also Read: బిహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ
For Telangana News And Telugu News