Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. ఆ ఫైల్‌పై సీతక్క సైన్
ABN , Publish Date - Feb 22 , 2025 | 03:50 PM
Telangana Govt: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శిశుసంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో (Women and Child Welfare Department) కొలువుల (Jobs) జాతర మొదలైంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం (Telangana Govt) నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది. ఖాళీల భర్తీకి సంబంధించిన ఫైల్ మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Women and Child Welfare Minister Seethakka) సంతకం చేశారు. మొత్తం 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఖాళీల భర్తీ ప్రకియతో అంగన్వాడీలు మరింత పటిష్టంగా పనిచేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు
Boy Death: మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారి మృతి
Read Latest Telangana News And Telugu News