Manchu Manoj: మనోజ్‌కు షాకిచ్చిన తిరుపతి హాస్టల్ యాజమానులు
ABN , Publish Date - Jan 20 , 2025 | 12:14 PM
Manchu Manoj: ‘‘మాకు ఏ సమస్యలు లేవు... ఒకవేళ ఉన్నా వాటిని మోహన్ బాబు, మంచు విష్ణుతో చెప్పుకుంటాం.. వారు మా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తారు. మోహన్ బాబు స్థాపించిన విద్యాసంస్థల వల్లే ఈ పాత్రంలో భూముల అభివృద్ధి జరిగింది. పండుగ రోజు మీరు విశ్వవిద్యాలయాల గేటును తన్నటం చూసి ఆశ్చర్యపోయాం’’ అంటూ మనోజ్‌కు తిరుపతి హాస్టల్ యజమానులు లేఖ రాశారు.

హైదరాబాద్, జనవరి 20: మంచు మనోజ్‌కు (Manchu Manoj) తిరుపతి ఏ రంగంపేట హాస్టల్ యజమానులు షాక్ ఇచ్చారు. తమకు ఎలాంటి సమస్యలు లేవని.. పైగా మోహన్ బాబు విద్యాసంస్థల వల్లే తాము బాగుబడ్డామని తెలిపారు. ఈ మేరకు మంచు మనోజ్‌కు హాస్టల్ యజమానులు లేఖ రాశారు. ‘‘మనోజ్ .. మీరు మాకేదో సమస్యలు ఉన్నట్టు అవి మీకు చెప్పినట్లు మీడియాలో మాట్లాడుతున్నారు. హాస్టల్స్ విద్యార్థులకు యాజమాన్యంతో సమస్యలు లేవు.. వర్సిటీల యాజమాన్యంతోనూ విద్యార్థులకు సమస్యలు లేవు. మాకు ఏ సమస్యలు లేవు... ఒకవేళ ఉన్నా వాటిని మోహన్ బాబు, మంచు విష్ణుతో చెప్పుకుంటాం.. వారు మా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తారు’’ అని అన్నారు
‘‘మోహన్ బాబు స్థాపించిన విద్యాసంస్థల వల్లే ఈ పాత్రంలో భూముల అభివృద్ధి జరిగింది. పండుగ రోజు మీరు విశ్వవిద్యాలయాల గేటును తన్నటం చూసి ఆశ్చర్యపోయాం.. ఎంతో మందికి ఉద్యోగాలను ఉపాధిని అందించిన విశ్వవిద్యాలయాలవి.. మనోజ్ మీ స్వార్థం కోసం మా బ్రతుకులతో ఆడుకోకండి.. మమల్మి రోడ్డుకి లాగకండి. మీకు, మీ కుటుంబసభ్యులకు సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి. మా సమస్యలను మీకు చెప్పుకున్నట్లు మీడియాలో ప్రచారం చేయడం సరికాదు. మనోజ్ చెప్పింది పచ్చి అబద్ధం. అత్యంత దారుణం’’ అంటూ ఏ.రంగంపేట, సాయినాథ్ ప్రైవెట్ హాస్టల్స్ యాజమాన్యం లేఖలో పేర్కొంది. తిరుపతిలోని 39 మంది హాస్టల్స్ ప్రతినిధులు సంతకాలు చేసి లేఖ రాశారు.
అమెరికాలో టిక్‌టాక్ సేవలు పునరుద్ధరణ.. ట్రంప్‍నకు థాంక్స్
కాగా.. తిరుపతిలోని మోహన్ బాబు విద్యాసంస్థల్లో విద్యార్థులు సమస్యల్లో ఉన్నారని మంచు మనోజ్ ఎక్కడ మీడియాతో మాట్లాడినా పదేపదే చెబుతున్నారు. తిరుపతి చుట్టుపక్కల ఉన్న హాస్టల్ యజమానులు.. విద్యార్థులను దోచుకుంటున్నారని, పెద్ద మొత్తంలో చార్జీలను వసూలు చేస్తున్నారని, సరైన భోజనం పెట్టడం లేదని మనోజ్ చెప్పుకొచ్చారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా హాస్టల్స్ సిబ్బందితో యాజమాన్యం కుమ్మక్కై.. హాస్టల్స్ పరిస్థితిపై విద్యార్థులు చెప్పినా.. వారికే చెడు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని... హాస్టల్స్ దోపిడీని ప్రశ్నించాలని మనోజ్ చెబుతూ వస్తున్నారు. అయితే మనోజ్ చెబుతున్నవన్నీ అబద్దాలే అని లేఖలో హాస్టల్స్ యాజమాన్యం పేర్కొంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థుల సమస్యలు, హాస్టల్‌లో సౌకర్యాలు, భోజన సదుపాయాలు, ఫీజుల వివరాలపై ప్రభుత్వం విచారణ జరపాల్సిన అవసరం ఈ లేఖ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Davos: సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన
USA: అమెరికాలో మరో తెలుగు యువకుడు దారుణ హత్య
Read Latest Telangana News And Telugu News