Karimnagar Politics: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వర్సెస్ మేయర్ సునీల్ రావు
ABN , Publish Date - Jan 28 , 2025 | 08:36 AM
కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు.. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు. సునీల్ రావును సస్పెండ్ చేయాలని గంగుల కమలాకర్ వర్గం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. గంగుల కమలాకర్ కంట్రోల్‌లో ఉండాలని, తనపై చిల్లర ఆరోపణలు చేస్తే అందరి చిట్టా విప్పుతానని మేయర్ అన్నారు.

కరీంనగర్: జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి (Heat Politics). మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula kamalakar) వర్సెస్ (V/s) మేయర్ సునీల్ రావు (Sunilrao)గా పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు పోటా పోటీ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై సీపీకి మేయర్ ఫిర్యాదు చేశారు. అలాగే సునీల్ రావుపై జిల్లా కలెక్టర్‌కు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. కాగా మంగళవారంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవి కాలం ముగియనుంది. ఈరోజు వీడ్కోలు సమావేశం జరగనుంది. అయితే కార్పొరేటర్ల హాజరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్ సునీల్ రావు వస్తే.. గొడవలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా సునీల్ రావు ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరారు.
ఈ వార్త కూడా చదవండి..
తులసిబాబుకు సునీల్ కుమార్‌తో ఉన్న సంబంధాలపై పోలీసుల ఆరా
మేయర్‌ను సస్పెండ్ చేయాలి..
మరోవైపు నగరపాలక సంస్థలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మేయర్ యాదగిరి సునీల్ రావును వెంటనే సస్పెండ్ చేయాలని, ఐదేళ్లలో ఆయన చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి చట్టపరంగా శిక్షించాలని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ ఆధ్వర్యంలో 31 మంది కార్పొరేటర్లు కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి మేయర్ సునీల్ రావుపై అవిశ్వాస నోటీసుతోపాటు సస్పెండ్ చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌గా ఎన్నికైన సునీల్‌రావు ఐదేళ్లలో నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికారం కోసం బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరారని, సునీల్‌రావు అవినీతిపై విచారణ జరిపి శిక్షించాలని అన్నారు.
బీజేపీలోకి సునీల్ రావు..
కాగా లోక్ సభ ఎన్నికల సమయంలో ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై విమర్శలు చేసిన మేయర్ సునీల్ రావు, ఎన్నికల తరువాత ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఎంపీ సహకారంతోనే స్మార్ట్ సిటీ పనులు కంప్లీట్ అయ్యాయని, ఆయనే ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించారని ప్రశంసల వర్షం కురిపించారు. తర్వాత బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యాక కార్పొరేటర్లందరినీ తీసుకెళ్లి సన్మానం చేయడం, పలుమార్లు ఆయనతో భేటీ కావడంతో అప్పట్లోనే మేయర్ చూపు బీజేపీ వైపు ఉందనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచే ఆయన బీఆర్ఎస్ తో కూడా కాస్త దూరం పాటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కరీంనగర్‌లోని గోదాంగడ్డ ఎస్‌బీఎస్ ఫంక్షల్‌హాల్‌లో శనివారం జరిగిన సమావేశంలో సునీల్ రావు, ఆయన అనుచరులు బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్‌రావు మాట్లాడుతూ.. ‘గంగుల కమలాకర్.. కంట్రోల్‌లో ఉండాలె, నాపై చిల్లర ఆరోపణలు చేస్తే అందరి చిట్టా విప్పుతా, మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి పనుల్లో ఏం జరిగిందో నా వద్ద ఆధారాలు ఉన్నాయి’ అన్నారు.
అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లడం సునీల్ రావు నైజం.. గంగుల కమలాకర్..
‘మేయర్ సునీల్‌రావు స్వార్థపరుడు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తాడు, వెన్నుపోటు పొడవడం ఆయనకు అలవాటే’ అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చి దొడ్డి దారిన మేయర్ అయ్యారని, ఆయనకు పదవి ఇవ్వొద్దని ఆరోజే చెప్పామన్నారు. అవినీతి బయట పడకుండా, కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీలో చేరుతున్నాడని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌ను సందర్శించిన భువనేశ్వరి
బాబు కష్టాన్ని దావోస్‌లో ప్రత్యక్షంగా చూశా
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News