Share News

రాహుల్‌జీ ఇదేనా మీ ‘సంవిధాన్‌ బచావో’?: కేటీఆర్‌

ABN , Publish Date - Jan 13 , 2025 | 05:06 AM

ఒకవైపు రాజ్యాంగం అమలుకోసం పోరాటం చేస్తానంటూ.. రాహుల్‌గాంధీ అంబేడ్కర్‌ రాసిన పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతుంటే..

రాహుల్‌జీ ఇదేనా మీ ‘సంవిధాన్‌ బచావో’?: కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు రాజ్యాంగం అమలుకోసం పోరాటం చేస్తానంటూ.. రాహుల్‌గాంధీ అంబేడ్కర్‌ రాసిన పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతుంటే.. రాష్ట్రంలో ఆ పార్టీ మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లో రాహుల్‌ గాంధీ సంవిధాన్‌ బచావో(రాజ్యాంగాన్ని కాపాడండి) ర్యాలీ చేస్తానంటుంటే.. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాత్రం మరికొంత మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని ప్రకటిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి గొప్పమార్గం ఇదేనా? రాహుల్‌జీ తెలంగాణలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అని కేటీఆర్‌ ఆదివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

Updated Date - Jan 13 , 2025 | 05:06 AM