Share News

Hyderabad : ‘సుంకిశాల’ నివేదికను దేశభద్రతతో ముడిపెడతారా?: కేటీఆర్‌

ABN , Publish Date - Jan 12 , 2025 | 05:33 AM

సమాచారహక్కు చట్టం కింద సుంకిశాల విజిలెన్స్‌ నివేదికను కోరితే దేశభద్రతతో ముడిపెట్టి నిరాకరించడం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

Hyderabad : ‘సుంకిశాల’ నివేదికను దేశభద్రతతో ముడిపెడతారా?: కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సమాచారహక్కు చట్టం కింద సుంకిశాల విజిలెన్స్‌ నివేదికను కోరితే దేశభద్రతతో ముడిపెట్టి నిరాకరించడం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సుంకిశాలలో రిటైనింగ్‌ వాల్‌ కూలి 80కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని, హైదరాబాద్‌ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలన్న సంకల్పానికి గండిపడిందని పేర్కొన్నారు.


నిర్మాణలోపం బయటపడుతుందనే భయంతోనే కాంగ్రెస్‌ పార్టీ విజిలెన్స్‌ నివేదికను వెల్లడించడానికి జంకుతోందని శనివారం ఓ ప్రకటనలో కేటీఆర్‌ విమర్శించారు. సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్లేనని ఇప్పటికైనా ప్రభుత్వం సుంకిశాల విజిలెన్స్‌ నివేదికను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 12 , 2025 | 05:33 AM