Union Minister: రేపు భారత మాతకు మహాహారతి
ABN , Publish Date - Jan 25 , 2025 | 10:37 AM
ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే భారతమాత మహాహారతిని ఈసారి వైభవంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 8వ విడత మహాహారతి సందర్భంగా కిషన్‌రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాట్లను పరిశీలించారు.

- పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్: ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే భారతమాత మహాహారతిని ఈసారి వైభవంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) తెలిపారు. 8వ విడత మహాహారతి సందర్భంగా కిషన్‌రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(Chintala Ramachandra Reddy) మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 8వ సారి భారతమాత మహాహారతిని వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: సులభంగా డబ్బు సంపాదించాలని.. నకిలీ యూఎస్ డాలర్లు, నోట్ల ప్రింటింగ్
ఆదివారం సాయంత్రం పీవీ నర్సింహారావు మార్గ్(PV Narasimha Rao Marg)లోని పీపుల్స్‌ప్లాజాలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొంటారని చెప్పారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భారతమాత ఫౌండేషన్ చైర్మన్ శ్యాంసుందర్‌గౌడ్, ప్రతినిధులు గౌతంరావు, శ్రీధర్ పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు
ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం
ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్ నజర్
ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు
Read Latest Telangana News and National News