SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద భారీ ప్రమాదం.. 8 మంది గల్లంతు
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:01 PM
SLBC Tunnel:శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. దోమలపెంట దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు.
నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. దోమలపెంట దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పనులను ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితం ఈ పనులు మొదలయ్యాయి. ఇవాళ(శనివారం) ఉదయం సమయంలో పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. టన్నెల్ పైభాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎడమగట్టు కాలువ టన్నెల్ ద్వారా నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు చేపట్టారు.
ఫస్ట్ షిఫ్ట్‌లో భాగంగా సుమారు 50 మంది కార్మికులు సొరంగంలో పనులు చేసేందుకు వెళ్లారు. ఉదయం 8.30 గంటల సమయంలో కార్మికులు పని చేస్తుండగా.. ఒక్కసారిగా పైకప్పు కూలి మట్టిపెల్లలు విరిగి కార్మికులపై పడ్డాయి. టన్నెల్ నుంచి 50 మంది కార్మికుల్లో 42 మంది బయటకు రాగా.. మిగతా 8 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలి వద్ద నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పంజాబ్, జమ్మూ, యూపీ, జార్ఖండ్‌కు చెందిన కార్మికులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గుర్‌జీత్ సింగ్(పంజాబ్), సన్నీత్‌సింగ్ (జమ్ముకశ్మీర్), శ్రీనివాసులు (యూపీ), మనోజ్ రూబెన (యూపీ), సందీప్ (ఝార్ఖండ్), సంతోష్ (ఝార్ఖండ్), జట్కా హీరాన్ (ఝార్ఖండ్) గుర్తించారు. అయితే బోల్టులు ఊడిపోవడంతో సిమెంట్ సెగ్మెంట్‌లు కూలాయి. మట్టిపెళ్లలు విరిగిపడడంతో బురదలో కార్మికులు కూరుకుపోయారు.ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. జనరేటర్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సొరంగ మార్గంలో దట్టమైన చీకటి, సహాయకచర్యలకు అంతరాయం నెలకొంది. సింగరేణి రెస్క్యూ టీం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
కార్మికుల ఆచూకీ దొరకలేదు: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, అధికారులు చేరుకున్నారు. టన్నెల్ దగ్గర పరిస్థితిని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నకార్మికులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ బురదలో 8 మంది కార్మికులు కూరుకుపోయారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. గల్లంతైన కార్మికులు పంజాబ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ చెందిన వారని అన్నారు. బోల్టులు ఊడిపోవడంతో సిమెంట్ సెగ్మెంట్‌లు కూలాయని చెప్పారు. ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ దొరకలేదని అన్నారు. జనరేటర్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. సొరంగ మార్గంలో దట్టమైన చీకటి, సహాయక చర్యలకు అంతరాయం నెలకొందని చెప్పారు. సింగరేణి రెస్క్యూ టీం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు..
ఈ వార్తలు కూడా చదవండి..
KTR: రేవంత్ యాక్సిడెంటల్ సీఎం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
Boy Death: మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారి మృతి
Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు
Read Latest Telangana News And Telugu News