Share News

Minister Jupally: ఆ అధికారిని సస్పెండ్‌ చేయండి..

ABN , Publish Date - Jan 31 , 2025 | 07:14 AM

హుస్సేన్‌సాగర్‌(Hussain Sagar)లో ఆదివారం మహాహారతి సందర్భంగా బాణసంచా కాల్చేందుకు అనుమతిచ్చి బోటు ప్రమాదానికి కారణమైన అధికారిని సస్పెండ్‌ చేయాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదేశించారు.

Minister Jupally: ఆ అధికారిని సస్పెండ్‌ చేయండి..

- ‘సాగర్‌’లో బోటు ప్రమాదంపై మంత్రి జూపల్లి ఆగ్రహం

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌(Hussain Sagar)లో ఆదివారం మహాహారతి సందర్భంగా బాణసంచా కాల్చేందుకు అనుమతిచ్చి బోటు ప్రమాదానికి కారణమైన అధికారిని సస్పెండ్‌ చేయాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదేశించారు. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) నేతృత్వంలో నెక్లె్‌సరోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో మహాహారతి సందర్భంగా నిర్వాహకులు హస్సేన్‌సాగర్‌ నీటిపై పర్యాటక సంస్థకు చెందిన బోట్లతో బాణసంచా కాల్చారు.


city2.2.jpg

ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు బాణసంచా నిల్వ ఉంచిన బోటుపై పడడంతో రెండు బోట్లకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో ఇరువురు మృతిచెందగా, మరికొందరు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇద్దరు మృతిచెంది, పర్యాటక సంస్థకు చెందిన రెండు బోట్లు పూర్తిగా దగ్ధమై భారీ మొత్తంలో నష్టం వాటిల్లినప్పటికీ ఐదు రోజులవరకు తనకు నివేదిక అందించక పోవడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) పర్యాటక సంస్థ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా కాల్చడానికి అనుమతిచ్చిన అధికారిని సస్పెండ్‌ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

Read Latest Telangana News and National News

Updated Date - Jan 31 , 2025 | 07:14 AM