Share News

MLA: సీఎం రేవంత్‌రెడ్డిది డైవర్షన్‌ పాలిటిక్స్‌..

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:39 AM

సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని, రైతుభరోసా, ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) ఆగ్ర హం వ్యక్తం చేశారు.

MLA: సీఎం రేవంత్‌రెడ్డిది డైవర్షన్‌ పాలిటిక్స్‌..

- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని, రైతుభరోసా, ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) ఆగ్ర హం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబంపై బురద చల్లడం ద్వారా తప్పుడు కేసులు పెట్టడం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా ఉందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: మహిళను బురిడీ కొట్టించి రూ. 11.92 లక్షలు కొట్టేశారు..


కేసీఆర్‌, కేటీఆర్‌లు అహర్నిశలు కష్టపడి హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌(Hyderabad brand image)ను ప్రపంచానికి చాటిచెప్పిన వారిపై ఈ విధంగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మానివేసి తప్పుడు ఆరోపణలు చేస్తే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కేటీఆర్‌పై పెట్టిన తప్పుడు కేసుపై ఏసీబీ(ACB) దర్యాప్తు జరుగుతుందని కేసులకు మేమేమి భయపడమని లీగల్‌గా వాటిని ఎదుర్కొంటామని పేర్కొన్నారు.


city8.2.jpg

డైవర్షన్‌ పాలిటిక్స్‌కు నిదర్శనంగా బీజేపీ, కాంగ్రెస్‌ కొట్లాట ఉందని, దీనికి నిదర్శనంగా పోలీసులు సమక్షంలో బీజేపీ వాళ్లపై కాంగ్రెస్‌ దాడులు, తిరిగి కాంగ్రెస్‌ వాళ్లపై బీజేపీ దాడులు చేసుకుంటున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా బీఆర్‌ఎస్‌ భయపడదని, కేటీఆర్‌ ఏసీబీ, ఈడీ విచారణకు హాజరవుతారని, మచ్చలేని నాయకుడిగా నిరూపించుకుంటారని తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2025 | 11:39 AM