Share News

Kavitha: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

ABN , Publish Date - Jan 19 , 2025 | 11:32 AM

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేల్పూర్ వద్ద స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేసామని, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కవిత అన్నారు. జక్రాన్ పల్లి వద్ద ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అర్వింద్ మాటలు చెప్పడం కాదని, చేతల్లో చూపించాలన్నారు. పసుపు బోర్డులో అందరికీ అవకాశం ఇవ్వాలని, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి రైతుల కోసం పని చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

Kavitha: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

నిజామాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kalvakuntla Kavitha) బీజేపీ (BJP)పై విమర్శలు (Comments) గుప్పించారు. పసుపు బోర్డు ప్రకటన కేవలం బీజేపీ కార్యక్రమంలా జరిగిందని, ప్రొటోకాల్ (Protocol) పాటించలేదని.. రాష్ట్ర మంత్రులు, మాలాంటి ప్రజాప్రతినిధులను ఇన్ వాల్వ్ చేయలేదని ఆమె దుయ్యబట్టారు. ఆదివారం నిజామాబాద్‌లో పర్యటిస్తున్న కవిత.. బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారని.. 2014 కు ముందు మేము మాటిచ్చామని, తాను ఎంపీగా ఉన్నపుడు దాదాపు 30 డాక్యుమెంట్లు తయారు చేసామని చెప్పారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు, ప్రధాని మోదీకి ఉత్తరం రాయడం మొదలు అనేక ప్రయత్నాలు చేసామని తెలిపారు. పసుపు బోర్డుతో పాటు మద్దతు ధర ఇవ్వాలని త్రిముఖ వ్యూహంతో వెళ్ళామని చెప్పారు.

పసుపుకు మద్దతు ధర రూ.15 వేలు ఉండాలని డిమాండ్ చేశామని, విదేశాల నుండి దిగుమతులు డబుల్ అయ్యాయని, పసుపు మీద దృష్టి పెట్టే వారైతే దిగుమతులు తగ్గించాలని కవిత అన్నారు. రాజకీయం కోసం కాకపోతే వెంటనే మద్దతు ధర ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ అర్వింద్‌కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటేనని, మేము ప్రయత్నాలు చేసినపుడు ఆయన రాజకీయాల్లో లేరని, తండ్రి చాటు బిడ్డలా ఉన్నారని అన్నారు. రీజనల్ పసుపు బోర్డు మేమే తెచ్చామని, పసుపు బోర్డు వెస్ట్, స్పైసిస్ బోర్డు చాలు అన్న ఎంపీ అర్వింద్ ఇప్పుడు ఎందుకు తెచ్చారని కవిత ప్రశ్నించారు.

ఈ వార్త కూడా చదవండి..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే..

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేల్పూర్ వద్ద స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేసామని, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కవిత అన్నారు. జక్రాన్ పల్లి వద్ద ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అర్వింద్ మాటలు చెప్పడం కాదని, చేతల్లో చూపించాలన్నారు. పసుపు బోర్డులో అందరికీ అవకాశం ఇవ్వాలని, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి రైతుల కోసం పని చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

మనసులో మాట చెప్పిన రఘురామ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 19 , 2025 | 11:32 AM