Hyderabad: దక్షిణ మధ్య రైల్వేలో పీసీఓఎంగా పద్మజ
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:24 PM
దక్షిణ మధ్య రైల్వే(South Central Railway)లో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్(పీసీఓఎం)గా కె.పద్మజ(K.Padmaja) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ 1991 బ్యాచ్‌కి చెందిన పద్మజ పీసీసీ ఎంగా విధులను నిర్వర్తిస్తూనే పీసీఓఎంగా అదనపు బాధ్యతలను నిర్వహించారు.
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే(South Central Railway)లో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్(పీసీఓఎం)గా కె.పద్మజ(K.Padmaja) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ 1991 బ్యాచ్‌కి చెందిన పద్మజ పీసీసీ ఎంగా విధులను నిర్వర్తిస్తూనే పీసీఓఎంగా అదనపు బాధ్యతలను నిర్వహించారు. దక్షిణమధ్య రైల్వేలో మొదటి మహిళా పీసీఓఎంగా పద్మజ బాధ్యతలు చేపట్టడం గమనార్హం.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
భారతీయ రైల్వేలో 30 ఏళ్లకు పైగా సేవలు అందిస్తోన్న ఆమె గతంలో దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాద్, సికింద్రాబాద్, గుంతకల్(Hyderabad, Secunderabad, Guntakal) డివిజన్‌లలో వివిధహోదాల్లో పనిచేశారు. అలాగే గోదావరి ఫెర్టిలైజర్స్ సంస్థ సలహాదారు (రవాణా)గా, జీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా, దక్షిణ మధ్య రైల్వే లలిత కళా సమితి సికింద్రాబాద్ ప్రెసిడెంట్‌గా సేవలు అందిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!
ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?
ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం
ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్ కుంభకోణంపై నీలినీడలు !
Read Latest Telangana News and National News