Home » Secundrabad
రైళ్లలో పూజలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు చేసింది. కోచ్‌లలో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం లాంటివి చేస్తే రైల్వేయాక్ట్‌లోని 67, 154, 164, 165 సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది.
సాధారణ నిర్వహణ కారణాలతో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో నడుస్తున్న 10 రైళ్ల నంబర్లను మారుస్తున్నట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్ఓ) శ్రీధర్ తెలిపారు. విశాఖపట్నం-కడప(Visakhapatnam-Kadapa) మార్గంలో 17488/17487 నంబర్లతో నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ కు 18521/18522 నంబర్లను కేటాయించారు.
రాఘవాపురం-రామగుండం(Raghavpuram-Ramagundam) మార్గంలో గూడ్సురైలు పట్టాలు తప్పిన కారణంగా దక్షిణమఽధ్య రైల్వే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వైపు వెళ్లే పలు రైళ్లను దారిమళ్లించింది. ఆ మార్గంలో నడవాల్సిన కొన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు.
Telangana: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికుల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైలు ఎక్కే సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా ఉండేందుకు ఈసారి సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
‘దానా’ తుఫాన్ ప్రభావంతో తూర్పుకోస్తా, దక్షిణ మధ్య రైల్వేల పరిధిలోని వివిధ మార్గాల్లో మొత్తం 41 రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఒడిశా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నట్టు సీపీఆర్ఓ శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు.
సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి.
దసరా, చాత్ పూజ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం దాదాపు 770 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు తెలిపింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) నుంచి బయలుదేరే వందేభారత్ రైల్లో(Vande Bharat train) బాంబు పెట్టానని ఓ అజ్ఞాతవ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా యువతకు గుడ్ న్యూస్. ఇకపై సికింద్రాబాద్ నుంచి గోవాకు వారానికి రెండు ట్రైన్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి మొదలుకానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దసరా వేడుకులకు ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 3 (నేటి) నుంచి 12వ తేదీ వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బల్కంపేట అమ్మవారి ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి(Secunderabad Ujjain Mahakali) అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.