Pushpak Buses: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు పుష్పక్ బస్సులు..
ABN , Publish Date - Feb 12 , 2025 | 07:20 AM
జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(JBS, Secunderabad Railway Station) నుంచి రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్‌కు మొదటిసారిగా 6 పుష్పక్ బస్సులను బుధవారం ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఇన్‌చార్జి ఈడీ రాజశేఖర్ తెలిపారు.

హైదరాబాద్ సిటీ: జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(JBS, Secunderabad Railway Station) నుంచి రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్‌కు మొదటిసారిగా 6 పుష్పక్ బస్సులను బుధవారం ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఇన్‌చార్జి ఈడీ రాజశేఖర్ తెలిపారు. శంషాబాద్‌లోని విమానశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో పుష్పక్ ఏసీ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. జేబీఎస్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, రాణిగంజ్, సచివాలయం(Raniganj, Secretariat), రవీంద్రభారతి, హజ్ హౌస్, నాంపల్లి, గాంధీభవన్, ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, బహుదూర్‌పురా, ఆరంఘర్, శంషాబాద్‌కు మొదటి బస్సు అర్థరాత్రి 12.55 నుంచి చివరి బస్సు రాత్రి 11.55 వరకు నడుపుతున్నట్లు తెలిపారు. రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు అర్థరాత్రి 12.50 నుంచి రాత్రి 11.50 వరకు బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: HYDRA: చెరువుల్లో ఎవరైనా మట్టి పోస్తే హైడ్రాకు సమాచారమివ్వండి
బస్సులు బయల్దేరే సమయం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు..
0:55, 3:15, 4:15, 5:15, 6:15, 7:55, 8:55, 9:55, 10:45, 11:45, 12:45, 13:45, 14: 25, 15:25, 16:25, 17:25, 18:15, 19:15, 20:15, 21:15, 21:55, 22:55, 23:55 సమయం వరకు.
ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు.. 0:50, 1:50, 2:50, 5:10, 6:10, 7:10, 8:10, 8:50, 9:50, 10:50, 11:50, 12:40, 1:40, 14:40, 15:40, 16:20, 17:20, 18:20, 19:20, 20:10, 21:10, 22:10, 23:10, 23:50 వరకు.
ఈవార్తను కూడా చదవండి: Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి
ఈవార్తను కూడా చదవండి: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..
Read Latest Telangana News and National News