Indian Railways: సంక్రాంతి పర్వదినాన గుడ్ న్యూస్..
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:47 PM
Indian Railways: సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ మార్గంలో నడుస్తున్న రెండో వందేభారత్ రైలుకు బోగీల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న వందేభారత్ ..
రెండో వందేభారత్‌కు రెట్టింపు కోచ్‌లు..
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ప్రయాణికులకు ఊరట
రేపటి నుంచి 16 బోగీలతో పరుగులు
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ మార్గంలో నడుస్తున్న రెండో వందేభారత్ రైలుకు బోగీల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న వందేభారత్ (20707/20708) రైళ్లు ఈనెల 13 (సోమవారం) నుంచి 16 బోగీల కూర్పుతో పరుగులు తీయనున్నాయి. గతేడాది మార్చి 12న ప్రారంభమైన ఈ వందేభారత్‌కు 7చైర్‌కార్లు, 1 ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీ ఉండగా, తాజాగా ఆ సంఖ్య 14 చైర్‌కార్లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లకు చేరింది. ప్రస్తుతం 530 మందితో ప్రయాణిస్తుండగా, కొత్త కూర్పుతో ఆ సంఖ్య 1,128 మందికి చేరనుంది. అయితే.. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు సగటున 145% ఆక్యుపెన్సీ ఉంటుండగా, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వస్తున్న వందేభారత్‌కు 159% ఆక్యుపెన్సీ ఉండడం విశేషం.
Also Read:
యుద్ధ క్షేత్రం నుంచి శాంతి కోసం!
పొలిటికల్ గేమ్.. కాంగ్రెస్ ఏకాకి..!
For More Telangana News and Telugu News..