Trains: చర్లపల్లి - కన్నియాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:43 PM
చర్లపల్లి - కన్నియాకుమారి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. ఈమేరకు ఆ రైళ్ల వివరాలను దక్షిణ రైల్వే వెల్లడించింది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రస్తుత వేసవిలో ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.

చెన్నై: వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్ధం తెలంగాణా రాష్ట్రం చర్లపల్లి నుంచి కన్నియాకుమారి(Cherlapalli to Kanyakumari) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07230 చర్లపల్లి-కన్నియాకుమారి వారాంతపు ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 2,9,16,23,30, మే 7,14,21,28, జూన్ 4,11,18,25 (గురువారం) తేదీల్లో చర్లపల్లి నుంచి రాత్రి 9.50 గంటలకు బయల్దేరి మూడో రోజు వేకువజామున 2.30 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది.
ఈ వార్తను కూడా చదవండి: Minister: తెలుగులో మాట్లాడినా మావైపు కన్నెత్తి చూడరు..
మరుమార్గంలో నెం.07229 కన్నియాకుమారి-చర్లపల్లి వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 4,11,18,25, మే 9,16,23,30, జూన్ 6,13,20,27 (శుక్రవారం) తేదీల్లో కన్నియాకుమారి నుంచి తెల్లవారుజామున 5.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లు గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట(Guntur, Tenali, Chirala, Ongole, Nellore, Renigunta), తిరుత్తణి, కాట్పాడి, తిరువణ్ణామలై మీదుగా వెళ్లనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Online Betting: ముదిరిన బెట్టింగ్ వ్యవహారం.. తారలపై కేసులు
BJP: రాజాసింగ్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారు
పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?
Read Latest Telangana News and National News