Share News

Hyderabad: జిల్లా జడ్జిలకు హైకోర్టుల జడ్జిలుగా పదోన్నతి.. ఎవరెవరికంటే..

ABN , Publish Date - Jan 15 , 2025 | 10:05 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు జిల్లా జడ్జిలకు హైకోర్టుల జడ్జిలుగా పదోన్నతులు లభించాయి. తెలంగాణ (Telangana) రాష్ట్రానికి చెందిన నలుగురికి హైకోర్టు జడ్జిలు(High Court Judges)గా పదోన్నతి లభించగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరికి ప్రమోషన్ వచ్చింది.

Hyderabad: జిల్లా జడ్జిలకు హైకోర్టుల జడ్జిలుగా పదోన్నతి.. ఎవరెవరికంటే..
Telugu States High Courts

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు జిల్లా జడ్జిలకు హైకోర్టుల జడ్జిలుగా పదోన్నతులు లభించాయి. తెలంగాణ (Telangana) రాష్ట్రానికి చెందిన నలుగురికి హైకోర్టు జడ్జిలు (High Court Judges)గా పదోన్నతి లభించగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరికి ప్రమోషన్ వచ్చింది. తెలంగాణ జిల్లాలకు చెందిన నందికొండ నర్సింగ్ రావు, శ్రీమతి రేణుకా యార, మధుసూదనరావు, తిరుమలాదేవిలను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే ఏపీకి చెందిన డాక్టర్ యడవల్లి లక్షణరావు, అవధానం హరిహరణాధ శర్మను ఏపీ హైకోర్టు జడ్జిలుగా కొలీజియం సిఫార్సు చేసింది. కాగా, రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే హైకోర్టుల జడ్జిలుగా వీరి నియామకం అమలులోకి వస్తుంది.

Updated Date - Jan 15 , 2025 | 10:05 PM