Share News

Tummala: ఏడాదిలో రైతు సంక్షేమానికి 40వేల కోట్లు

ABN , Publish Date - Jan 13 , 2025 | 04:57 AM

ప్రజా ప్రభుత్వంలో ఒక్క సంవత్సరం కాలంలోనే రైతు సంక్షేమం కోసం రూ.40వేల కోట్లు ఖర్చు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tummala: ఏడాదిలో రైతు సంక్షేమానికి 40వేల కోట్లు

  • 26 నుంచి 4 సంక్షేమ పథకాల అమలు: తుమ్మల

నల్లగొండ టౌన్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వంలో ఒక్క సంవత్సరం కాలంలోనే రైతు సంక్షేమం కోసం రూ.40వేల కోట్లు ఖర్చు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్‌ కార్డుల మంజూరు లాంటి పథకాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ రెవెన్యూ గ్రామాల వారీగా రికార్డులు పరిశీలించాలని సూచించారు. ఆర్వోఎ్‌ఫఆర్‌ పట్టాలు ఉన్న రైతులందరికీ రైతు భరోసా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jan 13 , 2025 | 04:57 AM