China manja: చైనా మాంజా తగిలి ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Jan 11 , 2025 | 10:06 AM
కొందరి సరదా మరికొందరికి గాయాలు చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పంతగులకు వాడుతున్న చైనా మాంజా. పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజా(China manja)ను అధికారులు నిషేధించారు.
హైదరాబాద్: కొందరి సరదా మరికొందరికి గాయాలు చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పంతగులకు వాడుతున్న చైనా మాంజా. పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజా(China manja)ను అధికారులు నిషేధించారు. అయితే అవేమీ పట్టించుకోని కొందరు చైనా మాంజాను వాడుతూ పతంగులు ఎరుగువేస్తున్నారు. శుక్రవారం చర్లపల్లి డివిజన్(Cherlapalli Division), శివసాయినగర్ కాలనీలో కొందరు గాలిపతంగులు ఎగురవేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Congress: రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు..
ఆ సయమంలో భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్న మహిళ మెడకు చైనా మాంజా దారం తగలడంతో గాయాలయ్యాయి. ఈ విషయాన్ని మహిళ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. మరో ప్రాంతం బీజేఆర్ నగర్(BJR Nagar) కాలనీ పార్కు వద్ద రోడ్డుపై కొందరు పతంగులు ఎగురవేస్తున్నారు. ఆ సయయంలో అదే కాలనీకి చెందిన శ్రీనివాస్ పటేల్(Srinivas Patel) కుమారుడు లోకేష్‌ను బైకుపై ఎక్కించుకుని వెళ్తుండగా కిందకు వేలాడుతున్న చైనా మాంజా దారం లోకేష్ పెదవి చేతికి తగలడంతో గాయాలయ్యాయి.
ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!
ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!
ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం
ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..
Read Latest Telangana News and National News