Share News

Mallu Bhatti Vikramarka: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే

ABN , Publish Date - Jan 05 , 2025 | 07:31 PM

Mallu Bhatti Vikramarka: రైతు రుణ మాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. రైతులకు రుణా మాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

Mallu Bhatti Vikramarka: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
Dy CM Mallu Bhatti Vikramarka

వరంగల్, జనవరి 05: ఎన్ని ఇబ్బందులున్నా.. రైతులకు తాము రుణ మాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రూ. లక్ష రుణ మాఫీ చేయ లేని వాళ్లు కూడా మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు. ఆదివారం వరంగల్‌లో డిప్యూసీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తాము చేస్తున్న అభివృ‌ద్ధి, సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వ లేక పోతున్నారన్నారని మండిపడ్డారు.

ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గానికి 3,500 ఇళ్లకు తగ్గకుండా ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12 వేల ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా తమ పథకాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే రూ. లక్ష రుణమాఫీ సైతం చేయ లేక పోయారని మండిపడ్డారు. బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి కూడా రుణమాఫీ చెయ్య లేక చేతులు ఎత్తేసిందని ఎద్దేవా చేశారు. తాము ఇచ్చిన హామీలను నిబద్ధతతో కచ్చితంగా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రూ. 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణ మాఫీ కాకపోతే తప్పకుండా చేస్తామని చెప్పారు.


కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్‌లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరి మాటలు చూస్తుంటే.. కడుపు తరుక్కుపోతుందని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇక రైతులకు బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. కానీ ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ.. తన సోషల్ మీడియాతోపాటు తన పత్రికలో విషప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు.

Also Read: ప్రభుత్వంపై స్వామీజీల ధర్మాగ్రహం.. డిక్లరేషన్

Also Read: ఏబీ వేంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

Also Read: చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే

Also Read :సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా.. నిజంగా మీకు పండగలాంటి వార్త


ప్రతి ఎకరాకు ఎలాంటి షరతులు లేకుండా తమ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీన నుంచి రైతు భరోసా పంపిణీ చేస్తామన్నారు. ఎవరు అడ్డు పడిన.. ఎన్ని కుట్రల చేసిన రైతు భరోసా పథకాన్ని మాత్రం అమలు చేసి తీరుతామని చెప్పారు. రైతుల పక్షానే తమ ప్రభుత్వం నిలబడుతోందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క్ పిలుపు నిచ్చారు.

For Telangana News And Telugu News

Updated Date - Jan 05 , 2025 | 08:02 PM