Share News

Maoist party: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ

ABN , Publish Date - Jan 25 , 2025 | 03:29 PM

Maoist party: పూజార్ కంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ శనివారం ఓ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసుల తీరుపై సంచలన ఆరోపణలు చేసింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.

Maoist party: ఆయన బతికే ఉన్నారు..  మావోయిస్టుల సంచలన లేఖ
Maoist party

వరంగల్ : పూజార్ కంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ బస్తర్‌ కాంకేర్, మారేడుబాక అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఇటీవల ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు (Bade Chokkarao) మృతిచెందినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చనిపోలేదని ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. సౌత్ జోన్ కమిటీ కార్యదర్శి సోమ్ తేర్ సమత పేరుతో లేఖ విడుదల చేశారు.


పోలీసులు కావాలనే ఫేక్ లెటర్ క్రియేట్ చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మరణించారని వెల్లడించింది. వారిలో నలుగురు మావోయిస్టులు కాగా మరో నలుగురు గ్రామస్తులు ఉన్నారని తెలిపింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది. జనవరి 16,17వ తేదీల్లో 8వేల మంది భద్రతా బలగాలతో 4 గ్రామాలపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని చెప్పింది. జనాల్లో అయోమయం సృష్టించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారని విమర్శించింది. పోలీసులు బూటకపు ప్రకటనలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దామోదర్, ఇతర సహచరులు క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది. అయితే ఇటీవల దామోదర్ తన సహచరులకు ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దామోదర్ క్షేమంగా ఉన్నారని మొదటగా ఏబీఎన్ చెప్పిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి

Bandi Sanjay: అలా చేస్తే ఒక్క రూపాయి ఇవ్వం.. రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Kidney Racket Case: సంచలన విషయాలు బయటపెట్టిన రాచకొండ సీపీ

Dil Raju: ఐటీ దాడులపై దిల్‌ రాజ్ ఫస్ట్ రియాక్షన్..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 25 , 2025 | 03:39 PM