KCR: కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ.. సిల్వర్ జూబ్లీ ఏర్పాట్లపై దిశానిర్దేశం
ABN, First Publish Date - 2025-04-05T15:01:15+05:30 IST
KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫాంహోస్‌లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం , మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు.
సిద్దిపేట జిల్లా: సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫాంహోస్‌లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం , మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు.
ఈ నెల 27వ తేదీన సిల్వర్ జూబ్లీ సభ ఏర్పాట్లపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి వరంగల్ సభకు జనసమీకరణపై దృష్టి పెట్టాలని నేతలకు కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ వరకు పార్టీ నేతలతో గులాబీ బాస్ సమావేశాలు నిర్వహించనున్నారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఎల కొలువు అయ్యారంటే..
భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాలు..
Updated at - 2025-04-05T15:03:52+05:30