Home » Andhra Pradesh » Ananthapuram
అయ్యప్ప నామస్మరణతో పట్టణం గురువారం మార్మోగింది. బెంగళూరు రోడ్డు, సూరప్పకట్టకింద, కిరికెర, ముద్దిరెడ్డిపల్లిలో అయ్యప్పస్వామి మండలపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
టీడీపీ సభ్యత్వాల నమో దు అంశాన్ని పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. ఆయన బుధవారం టీడీపీ అర్బన కార్యాలయంలో నియోజకవర్గం పరిశీలకుడు లక్ష్మీనారాయణతో కలిసి పలువురు టీడీపీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ నాయకులు అన్నాయి.
నా ప్రాణం ఉన్నంతవరకు తాడిపత్రి అభివృద్ధే లక్ష్యమని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మండలంలోని అనంతపురం- కందుకూరు రోడ్డంటే గతంలో అందరూ హడిలిపోయేవారు. 2022లో బీటీ రోడ్డు నిర్మించారు. అయితే వేసిన ఏడాదికే రోడ్డు దెబ్బతింది. ఇరువైపులా గుంతలు పడ్డాయి. దీంతో వాహన దారులు రాకపోకలు సాగించాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. ఏ గుంతల్లో పడిపోతామో అనే భయాందోళనకు గురయ్యేవారు.
ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. బుధవారం క్రిస్మస్ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణం, కంబదూరులోని చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
యాడికి గ్రామ పంచాయతీలో సర్పంచ అనూరాధ, వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. పంచాయతీ పాలనా వ్యవహారాల్లో కొందరు వైసీపీ నాయకులు పెత్తనం చలాయిస్తూ సర్పంచును పట్టించుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
పాడి పరిశ్రమపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారిం చింది. మునుపటి లాగే మినీ గోకులం నిర్మా ణాలకు పచ్చజెండా ఊపింది. వీటి నిర్మా ణం కోసం పశుపోషకు లకు 90 శాతం రాయితీ ఇవ్వాలని పశుసంవర్ధ కశాఖ కు మార్గాదర్శకాలు జారీ చేసింది. 2018 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మినీ గోకులాలకు శ్రీకారం చుట్టగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని గాలి కొదిలేసింది.
మానవాళికి దివ్యసందేశాలను వినిపిం చిన యేసుక్రీస్తు భూమిపై అవతరించిన రోజైన క్రిస్మస్ వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనం గా నిర్వహించారు. జిల్లాలోని చర్చిలన్నీ క్రైస్తవులతో కిటకిటలాడుతూ దేదీప్యమానంగా వెలుగొందాయి. ప్ర త్యేక ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వ హించారు.
రాయదుర్గం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన పొరాళ్ల శిల్ప అధ్యక్షతన బడ్జెట్ ప్రత్యేక సమావేశం జరిగింది. విప్ కాలవ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బడ్జెట్‌ను మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. అదే విధంగా సాధారణ సమావేశంలోని అజెండా అంశాలను సైతం ఏకగ్రీవంగా తీర్మానించారు.