బాపట్ల జిల్లా కేంద్రమే బాపట్ల నియోజకవర్గంగా ఉంది. ఇది బాపట్ల లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 2019 ఏపీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రఘుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. 25 మార్చి 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 1,83,917 మంది ఓటర్లు ఉన్నారు. 1951లో ఈ నియోజకవర్గం స్థాపితమైంది. ఈ నియోజకవర్గంలో బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం అనే మండలాలున్నాయి. 1952లో సీపీఐ నుంచి వెమ్ములపల్లి శ్రీ కృష్ణ, 1955లో కాంగ్రెస్ నుంచి మంతెన వెంకటరాజు, 1962లో స్వతంత్ర అభ్యర్థిగా కొమ్మినేని వెంకటేశ్వరరావు, 1967, 1972, 1978లలో కాంగ్రెస్ నుంచి కోన ప్రభాకరరావు, 1983లో స్వతంత్ర అభ్యర్థి సీవీ రామరాజు, 1985లో టీడీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, 1989లో కాంగ్రెస్ నుంచి చీరాల గోవర్ధన రెడ్డి, 1994లో టీడీపీ నుంచి శేషగిరిరావు, 1999లో మంతెన అనంతవర్మ టీడీపీ నుంచి, 2004, 2009లో గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక రాష్ట్ర విభజన తరువాత వరుసగా 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కోన రఘుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి కోన రఘుపతి, టీడీపీ నుంచి వేగేశన నరేంద్ర వర్మ పోటీ పడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా పోటీ వైసీపీ, టీడీపీల మధ్యే ఉండనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో జనసేన, బీజేపీలు ఇక్కడ అభ్యర్థిని పోటీలో నిలబెట్టలేదు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
