ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 29 ఎస్సీలకు, 7 నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వు చేయబడ్డాయి. 2019 శాసనసభ ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ గెలుపొందగా.. 23 స్థానాల్లో టీడీపీ, ఒక చోట జనసేన గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా.. వైసీపీ 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ 6లోక్సభ 10 శాసనసభా స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన అభ్యర్థులు 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మే13వ తేదీన ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. జూన్4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.