శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. 1951లో ఈ నియోజకవర్గం ఏర్పడగా.. 1952లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ ఈ నియోజకవర్గం నుంచి 1994లో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. టీడీపీ ప్రారంభం తర్వాత నియోజకవర్గ ప్రజలు టీడీపీని ఆదరిస్తూ వస్తున్నారు. కళింగ, వెలమ సామాజిక వర్గాలే ఇక్కడి గెలుపోటములను నిర్దేశిస్తాయి. నందిగామ, టెక్కలి, సంత బొమ్మాలి, కోటబొమ్మాలి మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు తిరిగి పోటీ చేస్తుండగా.. వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సాగు, తాగు నీటి సమస్యలు ప్రధానమైనవిగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో రవాణా సౌకర్యాలు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165