తెనాలి.. గుంటూరు జిల్లాలోని ఒక నియోజకవర్గం. ఇది గుంటూరు లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఇందులో తెనాలి, కొల్లిపర అనే మండలాలుంటాయి. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైసీపీ నుంచి అన్నబత్తుని శివ కుమార్ గెలుపొందారు. 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 2,62,998 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం 1951 నుంచి మనుగడలోకి వచ్చింది. అయితే తెనాలితో రాజకీయ నేతలకు ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ గెలిచే పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుంది. దీంతో తెనాలి ప్రధాన సెంటిమెంట్ నియోజకవర్గంగా మారింది. 1952, 1955, 1962లలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలపాటి వెంకటరామయ్య ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967, 1972, 1978లలో జనతా పార్టీ నుంచి ఇందిరా దొడ్డపనేని, 1983, 1985లలో టీడీపీ నుంచి అన్నాబత్తుని సత్యనారాయణ, 1989లో కాంగ్రెస్ నుంచి నాదెండ్ల భాస్కర రావు, 1994లో టీడీపీ నుంచి రవి రవీంద్రనాథ్, 1999లో గేగినేని ఉమ టీడీపీ నుంచి, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నాదెండ్ల మనోహర్, 2014లో టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్, 2019లో వైసీపీ నుంచి అన్నాబతుని శివకుమార్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2024లో వైసీపీ నుంచి అన్నాబతుని శివ కుమార్, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీలో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో టీడీపీ, బీజేపీలు ఇక్కడ అభ్యర్థిని పోటీలో నిలబెట్టలేదు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165