Home » Andhra Pradesh » Chittoor
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల పేర్లతో అధిక విద్యుత్ బిల్లులు వసూలు చేసి వినియోగదారుల నడ్డ్డి విరిచింది. ఇప్పుడూ అప్పటి పాపం వినియోగదారులను వెంటాడుతోంది.
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లూ అధికారుల మీద దబాయింపు పాలన చూసిన కొందరు కూటమి నేతలు, మేం మాత్రం తక్కువా అన్నట్టుగా అదే మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు.
టీటీడీ బోర్డులో తిరుపతికి చెందిన బీజేపీ నేత భానుప్రకా్షరెడ్డికి చోటు దక్కింది.
జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణ శుక్రవారం ఉదయం 6గంటలకు ప్రారంభమైంది. అయితే 8.30 గంటలకు సర్వర్‌లో సాంకేతిక సమస్య మొదలవగా, దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పరిష్కారమైంది.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, మెంబర్ల పూర్తి జాబితాలు వెల్లడిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఇవాళ(శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ జీఓ ఎంఎస్ నెంబర్ 243 జారీ చేశారు.
Andhrapradesh: కొత్తగా ఏర్పటయ్యే టీటీడీ పాలకవర్గం నియామకంలో ఒకరు ఇద్దరు సభ్యులపై ఆరోపణల నేపథ్యంలో సర్కార్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఆరోపణలు ఉన్న సభ్యుల నియామకంపై సందిగ్ధం చోటు చేసుకుంది. టీటీడీ సభ్యుల నియామక జీవో జారీ చేస్తున్న తరుణంలో ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తోంది.
అర్హులైన పేదలకు కేంద్ర పథకాలు అందాలని, ఇందుకోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తిరుపతి జిల్లా సమన్వయ అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ(దిషా) చైర్మన్ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, కో చైర్మన్ చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు సూచించారు.
రాష్ట్రంలో అన్యాక్రాంతమైన లిడ్ క్యాప్ భూములను కాపాడుకుంటామని, సంస్థకు పూర్వవైభవం తీసుకువస్తామని లెదర్ ఇండస్ట్రీస్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (లిడ్‌క్యాప్) చైర్మన్ పిల్లి మాణిక్యరావు అన్నారు.
చెన్నైకి ఇసుక తరలించడానికి సిద్ధంగా ఉన్న 14 చక్రాల లారీని, ఎక్స్‌కవేటర్‌ను పోలీసులు సీజ్ చేశారు. రేణిగుంట మండలం ఎస్ఆర్పట్టెడ వద్ద 14 చక్రాల లారీలో ఎక్స్కవేటర్ సాయంతో ఇసుక నింపి చెన్నైకు తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా నరసింహులు బుధవారం కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.