Home » Andhra Pradesh » Chittoor
తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో ప్రతి వందమందిలో 55 మందికి అప్పులున్నాయి.ఇటీవల జిల్లా బ్యాంకర్ల సంఘం చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.సంపాదన పెరగకపోయినా విపరీతంగా పెరుగుతున్న ధరలు చాలామందిని రుణాల పాల్జేస్తున్నాయి.
కొత్త సంవత్సరంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఆలయ అధికారులు భక్తుల కోసం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. క్యూలైన్లలోని భక్తులకు బిస్కెట్లు , బాదంపాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ ప్రారంభించారు. ఇకపై ప్రతినిత్యం ఈ కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
చిత్తూరు జిల్లా: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకోడానికి భక్తుల భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లును పరిశీలించారు.
పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య, సామర్థ్య పరీక్షలు రెండో రోజైన మంగళవారం కూడా పోలీసు పెరేడ్ మైదానంలో కొనసాగాయి. 600 మంది అభ్యర్థులకు గాను 403 మంది హాజరుకాగా 159 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు.
వి.కోట - పేర్నాంబట్ ప్రధాన రహదారిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పిల్ల మృతి చెందింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెవిన్యూశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లుగా, ఎంఆర్‌ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
తప్పతాగి బండబూతులు తిడుతూ వీధిరౌడీల్లా ప్రవర్తించిన ఇద్దరు ఇన్చార్జి తహసీల్దార్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ, విచారణ పూర్తయ్యేంతవరకు హెడ్‌క్వార్టర్స్ వీడరాదని ఆదేశించారు.
ఒక రోజు ముందే పెన్షన్ తీసుకున్న ఆ ముగ్గురు వృద్ధులు హఠాన్మరణం పాలవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు 5, 6, 7 తేదీల్లో కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి జనవరి ఫస్టున వచ్చే భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు.