Home » Andhra Pradesh » Elections
తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులు ఏ కలుగులో దాక్కున్న వారి లెక్కలు తెలుస్తామని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Venigandla Ramu) హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు చూసి తాను అమెరికా వెళ్లిపోతానని కొడాలి నాని (Kodali Nani) అనలేదా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) జూన్-09న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. నరేంద్ర మోదీ ఇంట్లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినలో పర్యటించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకునే వరకూ అందరి చూపు.. చంద్రబాబుపైనే..
ఢిల్లీలో ఎన్డీఏ పక్ష నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నివాసంలో నేడు(బుధవారం) సమావేశం అయిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి భాగస్వామ్య పక్షాలు తమ మద్దతును ఇచ్చాయి. అయితే ఈనెల 7న మరోసారి ఎన్డీఏ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పనితీరును గమనించిన ఏపీ ప్రజలు విలక్షణమైన తీర్పును ఇచ్చారు. పాలనను గాలికొదిలేసి వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రజలంతా చూశారు. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో పెట్టి.. ఆయన కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు.
ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనపై ఓటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాలు స్పష్టం చేశాయి. సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్ల రూపాయిలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా ఓట్లు పడకపోవడం వైసీపీ అధినేత జగన్‌ను ఆశ్చర్యం కలిగించింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి చేతిలో తన వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం చవిచూడటంతో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే తన రాజీనామా..
పవన్ కళ్యాణ్.. నిన్నటి వరకు నిలకడ లేని మనిషి.. సరైన ఆలోచన లేని నాయకుడు.. రాజకీయాల్లో రాణించలేడంటూ మాటలు పడ్డ వ్యక్తి.. అది గతం.. ప్రస్తుతం సీన్ మారింది. నేడు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రియల్ హీరో.
తాజాగా వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసే ప్రభంజనం సృష్టించింది. మొత్తం పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల విషయంలో ఎంత అహంకారం ప్రదర్శించారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సీఎం స్థాయిలో..