Share News

AP News: జగన్ పత్రిక, నీలిమీడియాకు భారీగా ప్రకటనలు... ఆ అధికారికి బిగ్ షాక్

ABN , Publish Date - Jun 06 , 2024 | 06:59 PM

ఏపీలో ప్రభుత్వం మారడంతో పలువురు అధికారులు రిలీవ్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఏపీ నుంచి రిలీవ్ చేయాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి పెట్టుకున్న దరఖాస్తు రిజెక్ట్ అయింది.

AP News: జగన్ పత్రిక, నీలిమీడియాకు భారీగా ప్రకటనలు... ఆ అధికారికి బిగ్ షాక్

అమరావతి: ఏపీలో ప్రభుత్వం మారడంతో పలువురు అధికారులు రిలీవ్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఏపీ నుంచి రిలీవ్ చేయాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి పెట్టుకున్న దరఖాస్తు రిజెక్ట్ అయింది. బటన్ నొక్కుడు పేరుతో జగన్ పత్రికకు, నీలిమీడియాకు భారీగా ప్రకటనల రూపంలో భారీగా దోచిపెట్టినట్లు కమిషనర్‌ విజయ్‌పై ఆరోపణలు వచ్చాయి.


గతంలో తమకు పొడిగింపు ఇవ్వాలని కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తేలడంతోతనను రిలీవ్ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం రిలీవ్ చేసేది లేదని విజయ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వం తేల్చి చెప్పింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ కొనసాగాలని విజయ్ కుమార్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Jun 06 , 2024 | 06:59 PM