AP Politics: కొడాలి నాని అమెరికాకు.. వెనిగండ్ల రాము షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jun 05 , 2024 | 09:58 PM
తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులు ఏ కలుగులో దాక్కున్న వారి లెక్కలు తెలుస్తామని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Venigandla Ramu) హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు చూసి తాను అమెరికా వెళ్లిపోతానని కొడాలి నాని (Kodali Nani) అనలేదా అని ప్రశ్నించారు.
కృష్ణాజిల్లా (గుడివాడ): తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులు ఏ కలుగులో దాక్కున్న వారి లెక్కలు తెలుస్తామని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Venigandla Ramu) హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు చూసి తాను అమెరికా వెళ్లిపోతానని కొడాలి నాని (Kodali Nani) అనలేదా అని ప్రశ్నించారు.
గత ఐదేళ్లుగా రెచ్చిపోయిన వైసీపీ నేతలకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తగిన సమాధానం చెబుతారని అన్నారు. వైసీపీ నేత కొడాలి నాని స్వార్థానికి చాలామందిని బలి చేశారన్నారు. చరిత్ర చూడనటువంటి మెజార్టీతో ప్రజలు తనను గెలిపించిన తీరుతో చాలా మంది మూర్ఖుల కళ్లు తెరచుకున్నాయని అన్నారు.
కొడాలి నానిని అభిమానిస్తే 20ఏళ్లు నెత్తిన పెట్టుకున్నారని తెలిపారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నుంచి గుడివాడలో జవాబుదారి పాలనను ప్రజలకు అందిస్తానని చెప్పారు. గుడివాడ అభివృద్ధికి చేతనైన కృషి చేస్తానని తెలిపారు.గుడివాడ ప్రజల అభిమానాన్ని మరింత పెంచుకునేలా తన పాలన ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో విజయం సాధించిన వెనిగండ్ల రాముకు అభినందనల వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కార్యాలయానికి వేలాదిగా కూటమి పార్టీల శ్రేణులు వచ్చి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జిందాబాద్ వెనిగండ్ల రాము నినాదాలతో కార్యాలయ పరిసరాలు మార్మోగాయి. పుష్పగుచ్చాలు, శాలువాలు, గజమాలలతో రాముకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి గుడివాడ ప్రజలు నారా భువనేశ్వరికు బహుమతిగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 53వేలకు పైగా మెజార్టీతో గెలిపించిన గుడివాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోవు 5ఏళ్లలో 25ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.
కౌంటింగ్ జరుగుతుండగానే 10.30గంటలకు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయాడన్నారు. కనీసం కౌంటింగ్ ప్రక్రియ సగం వరకు కూడా ఉండకుండా మాజీ ఎమ్మెల్యే వెళ్లిపోయారన్నారు. కొందరు బయటకు వచ్చేసి ప్రజల పక్షాన నిలబడ్డారని చెప్పుకొచ్చారు. వైసీపీ కార్యకర్తలు కూడా గుడివాడలో జరిగే అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చని వెనిగండ్ల రాము తెలిపారు.