Home » Andhra Pradesh » Guntur
జగన్ కల్తీ మద్యం కారణంగా 50 లక్షల మంది కిడ్నీ, లివర్ సమస్యలతో సతమతమవుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వ షాపుల్లోనే ఎమ్మార్పీ ఉల్లంఘనలు చోటు చేసుకోవడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎప్పుడూ లేని విధంగా 2019-24మధ్య అక్రమ మద్యం రవాణా కేసులు ఎందుకు నమోదయ్యాయని నిలదీశారు.
ఈ పరిస్థితికి తానే కారణమని జగన్ మాత్రం చెప్పుకోలేకపోయారు. ఓ రాష్ట్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే.. ఆర్థిక వనరులు ఉండాలి. అప్పులపై రాష్ట్రాన్ని నడిపిస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్న..
రాజధాని అమరావతి(Amaravati) పునఃనిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక అడుగు వేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లై పెంచాలని, సరైన సమయంలో సప్లై అందించాలని కోరారు.
తప్పు చేసిన వారిని చట్టబద్దంగా శిక్షిద్దామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు అరెస్టులు జరగాలి అంటే కుదరదని తేల్చిచెప్పారు. అది తనవిధానం కాదని... తాను చెడ్డపేరు తెచ్చుకునేందుకు మాత్రం సిద్ధంగా లేనని చెప్పారు. ఇసుక విషయంలో ఎవరు వేలు పెట్టవద్దని నేతలను హెచ్చరించారు....ఇసుక విషయంలో తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టంగా చెప్పానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నూతనంగా ఏపీలో మద్యం, ఇసుక విధానాలు తీసుకువచ్చారని, వాటిలో అంతా అవినీతేనని జగన్ ఆరోపించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల సమావేశం జరగనుంది. అనంతరం కొంతమంది ప్రజా ప్రతినిధులతో సీఎం ముఖాముఖి భేటీ కార్యక్రమం నిర్వహిస్తారు. సూపర్ 6 తో రాష్ట్ర అభివృద్ధికి బాటలు.. సాండ్, లిక్కర్ పాలసీలపై వైసీపీ దుష్ప్రచారం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు తదితర అంశాలపై చర్చించనున్నారు.
‘జూన్ వచ్చింది... పోయింది! ఇంకా తల్లికి వందనం పథకం అమలు కాలేదు’ అని ఎదురు చూపులు చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త! ‘సూపర్ సిక్స్’లో కీలకమైన ఈ పథకం కింద వచ్చే ఏడాది జనవరిలో తల్లులకు కాసులు అందనున్నాయి.
వైసీపీ నాయకులు రెzచ్చగొట్టి, ప్రతిపక్షాలను తిట్టాలని ఆదేశించడం వల్లే ఆనాడు దూషించాల్సి వచ్చిందని పోలీస్ అధికారుల వద్ద రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ‘నీవు దళితుడివి...నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సచివాలయంలో మొదటిసారిగా అప్సా సర్వసభ్య సమావేశం జరిగింది.