Home » Andhra Pradesh » Kadapa
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బద్వేల్ విద్యార్థి ఘటనలో నిందితుడు విగ్నేష్‌ను కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలను ఆయన వెల్లడించారు. బద్వేల్ పరిధిలోనే మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిందితుడు విగ్నేష్ తగలబెట్టాడని ప్రకటించారు.
ఇంటర్ చదువుతున్న బాలిక దస్తగిరమ్మపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో నాలుగు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశారన్నారు.
బద్వేల్‌కు చెందిన విఘ్నేశ్, బాధితురాలు చిన్నప్పటి నుంచీ ఒకే వీధిలో పెరిగారు. అయితే వీరిద్దరూ ప్రేమించుకోగా.. ఆరు నెలల క్రితం యువకుడికి మరో యువతితో పెళ్లి అయ్యింది.
డ్రైనేజీ వ్యవస్థకు అనుగుణంగా హోమియోపతి కళాశాల రోడ్డు నిర్మాణం చేపడతామని కమిషనర్ ఎన.మనోజ్‌రెడ్డి అన్నారు.
పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.
పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీ సుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ పగడాల జగన్నాథం తెలిపారు.
విద్యార్థి దశలోనే బాలికా, మహిళా చట్టాలపై అవగాహన పెం చుకోవాలని జిల్లా 2వ అద నపు జడ్జి బి.అబ్రహాం పేర్కొ న్నారు.
సంతానలక్ష్మి గా పేరుగాంచిన రెడ్డెమ్మకొండ ఆలయం చైర్మన పద వి ఎవరిని వరిస్తుందో ఇంకా అర్థంకాని పరిస్థితి. ఆలయ చైర్మన పదవి ఖాళీగా ఉండడంతో ఆలయం లో అభివృద్ది పనులు కుంటుపడుతున్నాయి.
నగరంలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. కడప నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై గుర్తుతెలియని దుండగలు దాడికి తెగబడ్డారు. నగరంలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న శివకొండారెడ్డిపై దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు.
రైతులకు అన్ని సౌకర్యాలతో రైతు బజార్ సిద్ధం చేశామని వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఏడీఎం త్యాగరాజు పేర్కొన్నారు.