Home » Andhra Pradesh » Krishna
Andhrapradesh: అసభ్యకర పోస్టుల పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది.
Andhrapradesh: ఢిల్లీ మెట్రో అధికారులు విశాఖ, విజయవాడకు లైట్ మెట్రోను సిఫారస్సు చేశారని మంత్రి నారాయణ అన్నారు. గతంలో ఇచ్చిన టెండర్లను వైసీపీ ప్రభుత్వం 2019లో క్యాన్సిల్ చేసిందని అన్నారు. అప్పటి ప్రభుత్వానికి మెట్రో చేయాలనే ఉద్దేశమే లేదని విమర్శించారు. అయితే కేంద్రంతో మాట్లాడి కలకత్తా మోడల్లో మెట్రో ప్రాజెక్టును...
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా గ్రామ మహిళా కార్యదర్శులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. అలాగే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆన్సర్ ఇచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెబుతున్నారు. అనంతరం 2024 -25 ఆర్దిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.
అసెంబ్లీలో ప్రభుత్వం మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు - 2024 ను డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు- 2024 ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సవరణ బిల్లు-2024 ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు మానస పుత్రికగా.. ఎంతో ముందుచూపుతో ఆయన స్వంత మండల కేంద్రం పామర్రులో ప్రయాణికుల సౌకర్యార్ధం నిర్మించిన బస్టాండ్ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఎంతగానో సేవలందించింది. కాలక్రమంలో బస్టాండ్‌ను పట్టించుకునే నాథుడు లేక ఎంతో చరిత్రగల పామర్రు బస్టాండ్ రూపు కోల్పోయి.. పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.
పేదల పిల్లలంటే అందరికీ అలుసే.. ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుకునేందుకు వచ్చే వారిపై అక్కడి సిబ్బంది తీరు అమానుషం. అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలను ఉంచుతారా అని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బందిని నిలదీస్తున్నారు.
కొరియా సహకారంతో సుస్థిర సంస్థల పురోగతికి విజయవాడలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్వారామంజూరైన సమర్ధ్ ప్రాజెక్టును దక్షిణ కొరియా రాయబారి లింగ్సాంగ్ వూ మంగళవారం ప్రారంభించారు.
గ్రామాల్లో విచ్చలవిడిగా తిరు గుతున్న వీధికుక్కలు పసిపిల్లల ప్రాణాలు తీసేస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు ఆడుకునేందుకు వీధిలోకి వస్తే చాలు మూకుమ్మడిగా దాడిచేస్తున్నాయి. రాత్రివేళల్లో ప్రజలు ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ప్రతి వీధిలోనూ పదుల సంఖ్యలో కుక్కలు సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
సిద్ధార్ధ మహిళా కళాశాలలో మంగళవారం కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ర్టీ ఆధ్వర్యంలో పాస్టర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లేబొరేటరీ గుంటూరు సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ బయాలజీ అనే అంశంపై రెండు రోజుల శిక్షణ శిబిరం నిర్వహించారు.