Home » Andhra Pradesh » Nellore
Andhrapradesh: జిల్లాలోని కావలి జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్ఎస్ఆర్ స్కూల్ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే స్కూల్ బస్సులో పది మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. మరో అయిదుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి.
Andhrapradesh: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున కొత్తహాలు వెనుక ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. శ్రీరామ్ చిట్ ఫండ్ కంపెనీ కార్యాలయంలో మొదటిగా మంటలు వ్యాపించాయి. అనంతరం దిగువ అంతస్థులో బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి మంటలు చెలరేగాయి.
ఏపీలో రేపు ఉదయం 6 గంటల నుంచి 65 లక్షల మందికి రూ.7 వేలు చొప్పున పెన్షన్ పంపిణీ జరుగుతుందని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు.
చట్ట సభల్లో హుందాగా మాట్లాడాలని, రాజకీయాలు రోజు రోజుకూ దారుణంగా మారుతున్నాయని... ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియడం లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు.
అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. ఈ క్యాంటీలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 203 అన్నా క్యాంటీన్లను 100 రోజుల్లో ఓపెన్ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని.. ఆ మేరకు స్థలాల సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే కొన్నిటిని గుర్తించామని వివరించారు.
అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. రొట్టెల పండుగ సమయంలో అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఈ రోజు ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవని.. మున్సిపల్ శాఖలో రూ.3500కోట్లు మాత్రమే ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీ పాలనలో క్రమేణా దర్గాని అభివృద్ధి చేశామన్నారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నెల్లూరులోనూ పార్టీ కార్యాలయం పేరిట జగన్ ఒక రాజప్రసాదాన్ని నిర్మించారు. జనార్ధన్ రెడ్డి కాలనీలో గతంలో పేదల టిడ్కో ఇళ్ల కోసం కేటాయించిన 2 ఎకరాల భూమిని జగన్ పార్టీ స్వాహా చేసింది.
వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి(YSRCP former MP Adala Prabhakar Reddy) వ్యాపార భాగస్వామి ప్రసాద్ చౌదరి(Prasad Chaudhary)పై ఆయన అనుచరులు విచక్షణ రహితంగా దాడులకు పాల్పడడం నెల్లూరులో సంచలనంగా మారింది. ప్రసాద్ చౌదరిని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి నుంచి నడిరోడ్డు పైకి తరిమి మరీ దాడి చేయడంతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. బర్మాసెల్ గుంట (Barmasel Gunta) వద్ద పూరిళ్లల్లో ఒక్కసారిగా మంటలు(Fire Accident) చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిక్కుకొని నాగలక్ష్మి (Nagalakshmi) అనే బాలిక మృతిచెందినట్లు తెలుస్తోంది.