Chinta mohan: ఏపీ అప్పులపై నిజనిర్ధారణ కమిటీకి చింతామోహన్ డిమాండ్
ABN , Publish Date - Aug 01 , 2024 | 12:45 PM
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు కలక్టరేట్ ఎదుట మాజీ కేంద్ర మంత్రి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ అయిదేళ్ల పాలనలో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆర్ధిక, రెవెన్యూ వ్యవస్థలని నాశనం చేశారని దుయ్యబట్టారు.
నెల్లూరు, ఆగస్టు 1: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) హయాంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ (Former Union Minister Chinta Mohan) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు కలక్టరేట్ ఎదుట మాజీ కేంద్ర మంత్రి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ అయిదేళ్ల పాలనలో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆర్ధిక, రెవెన్యూ వ్యవస్థలని నాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనకు ఏపీలో ఒక కుటుంబం, తెలంగాణలో ఒక కుటుంబమే కారణమన్నారు.
Viral Video: నీళ్లలో కొట్టుకుపోతున్న కారు.. ఓ వ్యక్తి బయటికి దూకేయగా.. చివరకు అంతా చూస్తుండగానే..
అక్కడ కుటుంబం పదేళ్లు పాలించి రూ.వేల కోట్లు సంపాదించిందని విమర్శించారు. ఏపీలో కూడా ఒక కుటుంబం పదేళ్లకి పైగా పాలించి రూ.వేల కోట్లు దోచుకుందని మండిపడ్డారు. ఆ రెండు కుటుంబాల ధన దాహం, అధికార దాహం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని 9 కోట్ల ప్రజలు నష్టపోయారన్నారు. ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఏపీకి రూ.7 లక్షల కోట్లు అప్పు అని వైఎస్ జగన్ అంటే, పయ్యావుల కేశవ్ రూ.13.5 లక్షల కోట్లు అప్పు ఉందని అన్నారని తెలిపారు. వారిద్దరిలో ఎవరు చెప్పింది నిజమో తేలాలని అన్నారు. అందుకు ఏపీ అప్పులపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
Hyderabad: స్మితా సబర్వాల్‌ను తొలగించాలంటూ నిరసన
పోలవరం ప్రాజెక్టుకి నలుగురు సీఎంల హయాంలో ఎంత నిధులు ఇచ్చారని... ఎవరెవరు కాంట్రాక్టర్లకి ఇచ్చారు అన్న దానిపై జ్యూడీషియల్ విచారణ జరపాలన్నారు. ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో గ్రాంటుగా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని.. అయితే ప్రపంచ బ్యాంకు ఏపీ రాజధానికి అప్పు ఇవ్వదన్నారు. వారి నిబంధనలకి విరుద్ధమని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు అంటూ చింతా మోహన్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Free Sand Policy: ఇసుకలో ఎందుకీ గందరగోళం?
Venkataprasad: 55 రోజుల్లో రెండోసారి పెన్షన్ పంపిణీతో ప్రజల్లో ఆనందం...
Read Latest AP News And Telugu News