Share News

Anam Ramanarayana Reddy: విజయసాయిపై సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Jul 18 , 2024 | 02:47 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ టాపిక్‌గా మారారు. దేవదాయ శాఖలోని ఉద్యోగిణితో సంబంధం ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు.

Anam Ramanarayana Reddy: విజయసాయిపై సంచలన ఆరోపణలు
Minister Anam Ramanarayana Reddy

నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ టాపిక్‌గా మారారు. మదన్‌మోహన్‌ మానిపాటి అనే వ్యక్తి దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ కె.శాంతిపై ఆరోపణలు చేశారు.


ALSO Read: AP News: అడ్డొచ్చిన పోలీసులను ప్రేమోన్మాది ఏం చేశాడంటే?

ఆమె తన భార్య అని.. తాను విదేశాల్లో ఉండగా వేరొకరితో గ‌ర్భం దాల్చిందని.. దీనిపై విచారణ జరిపి.. ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తన భార్య గర్భానికి విజయసాయి రెడ్డి, న్యాయవాది సుభాష్‌లే కారణమనే ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖలో తెలిపారు. పవిత్రమైన దేవదాయ శాఖలో ఈ అపవిత్రమైన పనులేంటని మదన్మోహన్ లేఖలో ప్రశ్నించారు. దేవదాయ శాఖలోని ఉద్యోగిణితో సంబంధం ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై విపరీతమైన చర్చ జరుగుతుండగా.. ఈ ఆరోపణలను నిరాధారమైనవని విజయసాయి రెడ్డి కొట్టిపారేశారు. రెండు రోజుల క్రితం మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. ఆ సమయంలో టీడీపీ నేతలను విమర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు,మంత్రులు వరుసగా విజయసాయిక్ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.


ALSO Read: Nara Lokesh: జగన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ కౌంటర్..

A1గా మారేందుకు..

తాజాగా విజయ సాయిరెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి (Minister Anam Ramanarayana Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఎన్నికల ముందు A2 గురించి నేను చెప్పాను. ఆయన తండ్రి కూడా A2నే. ఆయన ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు. A2గా ఉంటే బాగుండదని A1గా మారేందుకు విశాఖపట్నంలో పలు కార్యక్రమాలు చేశారు. ట్విట్టర్ బాబాయిని ట్విట్టర్ తాతయ్య చేసి A1గా ముద్ర వేశారు. ఇలాంటి దుర్మార్గపు నాయకులు మనకు అవసరమా..?ఐదేళ్లలో దురాగతాలు చేశారు. నెల్లూరు ప్రజలు ఓడించి మంచి పని చేశారు. పాత్రికేయ సమావేశంలో తన మీద నిందలు వేసిన వారి గురించి మాట్లాడకుండా మీడియా గురించి బూతులు తిట్టారు. మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల గురించి ట్వీట్లు చేశారు. అప్పుడు కుటుంబ విలువలు గుర్తుకు రాలేదా..? శాంతి అనే ఉద్యోగి దేవదాయా శాఖలో సహాయ కమిషనర్‌గా ఉంది. ఆమె ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉంది. 2019లో సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైంది. ఆమెకు విశాఖలో పోస్టింగ్ ఇచ్చారు’’ అని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి తెలిపారు.


శాంతికి రాజకీయ నేతలతో సంబంధాలు

‘‘ఆమెపై వచ్చిన ఆరోపణలపై కమిషనర్ స్థాయి అధికారులు విచారణ చేసి సస్పెండ్ చేశాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండే ఉంటే సస్పెన్షన్ కు జరిగేది కాదేమో. ఆమెకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయి. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడ్డారు. విజయవాడలో విల్లా కొనుక్కోవాలని కమిషనర్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అందుకు కమిషనర్ అనుమతి ఇవ్వలేదు.అపార్ట్‌మెంట్ కొనుగోలుకు అనుమతించారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి చేసిన రెవెన్యూ దండాలు రెవెన్యూ న్యాయవాది సుభాష్ ..శాంతిల పాత్ర ఉందని మాకు సమాచారం అంది. ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములను కూడా.. అక్రమంగా కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై కూడా విచారణ చేస్తున్నాం. దేవాదాయ శాఖ భూములను 99 సంవత్సరాల లీజుకు కూడా ఇచ్చారు. నివేదికలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Politics: పుంగనూరులో ఉద్రిక్తత.. టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతల రాళ్ల దాడి..

Budda Venkanna: మీడియాపై విజయసాయి వ్యాఖ్యలు సిగ్గుచేటు..

Ganta Srinivasa Rao: గుడివాడ అమర్‌నాథ్‌కు గంటా స్ట్రాంగ్ కౌంటర్..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 03:14 PM