AP Politics: వైసీపీకి లక్ష.. టీడీపీకి రెండు లక్షల ఫైన్.. రూట్ మార్చిన కోటంరెడ్డి.. !
ABN , Publish Date - Jul 31 , 2024 | 08:13 PM
నెల్లూరు జిల్లాలో మాస్ పొలిటీషియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. తాను నమ్మిన వ్యక్తుల కోసం ఎంతకైనా తెగిస్తారు. తనను అనుమానించినా.. అవమానించినా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఒక్కనిమిషం ఉండరు.
నెల్లూరు జిల్లాలో మాస్ పొలిటీషియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. తాను నమ్మిన వ్యక్తుల కోసం ఎంతకైనా తెగిస్తారు. తనను అనుమానించినా.. అవమానించినా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఒక్కనిమిషం ఉండరు. వైసీపీ అధినేత జగన్‌కు వీరవిధేయుడిగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆ పార్టీ అధినేతతో పాటు కొందరు సీనియర్ల వైఖరి నచ్చక వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసలే కోటంరెడ్డి అంటే దూకుడు.. ఇక అధికారపార్టీ ఎమ్మెల్యే.. ఆయన వేగాన్ని ఎవరైనా నియంత్రించగలరా.. లేదు.. కానీ విచిత్రంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూర్తిగా తన స్టైల్ మార్చేశారట. వాస్తవానికి వైసీపీని వీడినప్పటినుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. తన అనుచరుల మధ్య చీలికలు తీసుకొచ్చింది. ఆలెక్కల్లో కోటంరెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో విపక్ష వైసీపీ మీద కక్ష తీర్చుకుంటారని.. పగ, ప్రతీకారంతో రెచ్చిపోతారని అంతా భావించారట. కానీ ప్రస్తుతం ఆయనను చూస్తే మాత్రం అసలు ఆయన కోటంరెడ్డినేనా.. మరెవరైనానా అనే చర్చ జరుగుతోందట.
Big Breaking: ఏపీలో ఏకంగా 96 మంది డీఎస్పీల బదిలీ
సొంత నేతలకు వార్నింగ్..
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విపక్ష నేతలపై పగ, ప్రతీకారం తీర్చుకోవడం పక్కనపెడితే.. సొంత పార్టీ నాయకులైనా.. తనను నమ్ముకున్న అనుచరులైనా సరే.. తప్పు చేస్తే శిక్ష తప్పదు అంటున్నారట. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై ఆయన అనుచరులే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు కోటంరెడ్డిలో ఈ మార్పు ఏమిటి.. ఇదేమైనా వ్యూహంలో భాగమా అనే చర్చ జరుగుతుందట. ఎవరైనా విపక్ష పార్టీ నేతలు అక్రమంగా ఇసుక, మైనింగ్ వ్యవహరాల్లో తలదూరిస్తే లక్ష రూపాయిల జరిమానా, సొంత పార్టీ నేతలైతే రూ.2లక్షల జరిమానా అంటూ సొంత పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారట. కోటంరెడ్డి గురించి తెలిసిన వాళ్లు ఈ విషయం విని ముక్కున వేలేసుకుంటున్నారట.
CM Chandrababu: సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు..
రూ.10 లక్షల ఫైన్..
కేవలం అక్రమ దందాలే కాదు.. తన పేరు, పరపతి ఉపయోగించుకుని నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరికలు జారీచేశారనే ప్రచారం జరుగుతోంది. ఎవరైనా తన పేరును దుర్వినియోగం చేస్తే రూ.10 లక్షల ఫైన్ వేస్తానని చెప్పారట. దీంతో కోటంరెడ్డితో జాగ్రత్తగా ఉండాలంటూ సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోవడంతోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడంతో.. ఈసారి జాగ్రత్తగా ఉండాలని.. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ప్రజల్లో పేరును చెడగొట్టుకోకూడదనే ఉద్దేశంతోనే కోటంరెడ్డి ఇలా చెప్పి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
Good News: ఏపీలో బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించిన ప్రభుత్వం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News