Kotamreddy: ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పారు
ABN , Publish Date - Jul 20 , 2024 | 02:57 PM
Andhrapradesh: ‘‘రొట్టెల పండుగ మీద పూర్తి విశ్వాసం కల్గిన వ్యక్తి నేను’’ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం స్వర్ణాల చెరువులో సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని ఎమ్మెల్యే రొట్టెలు పట్టుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... దర్గాలో పూజలు చేసి రొట్టెలు పట్టుకుంటే సంకల్పం నెరవేరుతుందని స్వయంగా చంద్రబాబే చెప్పారన్నారు.
నెల్లూరు, జూలై 20: ‘‘రొట్టెల పండుగ మీద పూర్తి విశ్వాసం కల్గిన వ్యక్తి నేను’’ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridharreddy) అన్నారు. శనివారం స్వర్ణాల చెరువులో సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని ఎమ్మెల్యే రొట్టెలు పట్టుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... దర్గాలో పూజలు చేసి రొట్టెలు పట్టుకుంటే సంకల్పం నెరవేరుతుందని స్వయంగా చంద్రబాబే (CM Chandrababu) చెప్పారన్నారు. గత ఏడాది చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రొట్టె పట్టుకోగా నెరవేరిందని తెలిపారు.
KTR: రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని గవర్నర్‌కు వివరించాం
మంచి మనస్సుతో ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు విజయవంతమైతే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పారన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఆరు సూపర్ సిక్స్ పథకాల రొట్టెలు స్వర్ణాల చేరువులో పట్టుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు అనుభవంతో ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీసిందని విమర్శించారు. రాష్ట్రామున్న పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపగలరన్నారు. చంద్రబాబు కష్టంతో పాటు బారా షాహిదుల అశీసులు ఉండాలని కోరుకుంటూ రొట్టెలు పట్టుకున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
Delhi Liquor Scam: 10 కిలోల బరువు తగ్గిన కవిత ?.. భర్త అనిల్ కంటతడి!
ఘనంగా రొట్టెల పండుగ...
కుల, మతాలకు అతీతంగా నిలిచే రొట్టెల పండుగ ఈనెల 17న ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 21 వరకు రొట్టెల పండుగ జరుగనుంది. రొట్టెల పండుగలో అత్యంత ముఖ్యమైన గంధం ఈనెల 18 న జరుగింది. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఈ పండుగ కోసం తరలివస్తున్నారు. దర్గా వద్ద తమ కోరికలను కోరడమే కాకుండా, కోరిన కోరికలు నెరవేరినందుకు గాను భక్తులు రొట్టెలను ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి...
TTD EO: తిరుమల ప్రక్షాళానికి శ్రీకారం...
Nagababu: జగన్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్
Read Latest AP News And Telugu News