Home » Andhra Pradesh » Nellore
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారారు. దేవదాయ శాఖలోని ఉద్యోగిణితో సంబంధం ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు.
Andhrapradesh: మొహరం పర్వదినాలలో నిర్వహించే రొట్టెల పండుగ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా బారా షహీద్ దర్గా వద్ద హిందూ, ముస్లింలు కలిసి ఈ వేడకను నిర్వహిస్తుంటారు. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఈ పండుగ కోసం తరలివస్తున్నారు. దర్గా వద్ద తమ కోరికలను కోరడమే కాకుండా, కోరిన కోరికలు నెరవేరినందుకు గాను భక్తులు రొట్టెలను ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు.
నాయుడుపేట(Naidupeta) గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై గూడూరు(Gudur) ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి చెప్పారు.
Andhrapradesh: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి హుటాహుటిన జిల్లాకు బయలుదేరారు. తిరుపతి జిల్లా నాయుడపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న(ఆదివారం) కలుషిత ఆహారం వల్ల పాఠశాలలోని దాదాపు 150 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడకి వెళ్లినా ఏ ప్రాజెక్టు చూసినా వైసీపీ పాలనలో జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) చేసిన విధ్యంసమే కనపడుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా.. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.
Andhrapradesh: జగన్ సర్కార్ హయాంలో గాలికి వదిలేసిన సోమశిల డ్యామ్ను కాపాడేందుకు కూటమి సర్కార్ ముందుకు వచ్చింది. డ్యామ్ రక్షణకు అవసరమైన చర్యలపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. రేపు (ఆదివారం) సోమశిల డ్యాంను మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ పరిశీలించనున్నారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) తెలిపారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్ది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. లెవన్ రెడ్ది రాష్ట్రాన్ని దోచుకొని ఆర్ధికంగా కుదేలు చేశారని మండిపడ్డారు. ఒక క్రిమినల్, రౌడీలని పరామర్శించేందుకు రూ.25 లక్షలు ఖర్చుపెట్టుకొని వచ్చారన్నారు.
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్పై సొంత క్యాడర్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మనుగడ కష్టమనే చర్చ నడుస్తోంది.