Share News

Minister Dola: ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం: మంత్రి డోలా

ABN , Publish Date - Jul 15 , 2024 | 02:47 PM

నాయుడుపేట(Naidupeta) గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై గూడూరు(Gudur) ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి చెప్పారు.

Minister Dola: ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం: మంత్రి డోలా
Minister Dola Sree Bala Veeranjaneya Swamy

నెల్లూరు: నాయుడుపేట(Naidupeta) గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై గూడూరు (Gudur) ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి చెప్పారు. ఆహారంలో కలుషితం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తోందని ఆయన వెల్లడించారు. మెుదటగా విద్యార్థులను ఆయన ఆప్యాయంగా పలకరించి.. ప్రస్తుతం ఒంట్లో ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లను కలిసి చిన్నారుల పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు.


ఈ సంఘటన చాలా బాధాకరం, దురదృష్టకరమని మంత్రి డోలా ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్‌ విషయంలో గురుకుల పాఠశాల సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యం కనిపిస్తోందని మంత్రి చెప్పారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి డోలా తెలిపారు. సంఘటనపై సమగ్ర విచారణకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలకు తాత్కాలికంగా మూడ్రోజులపాటు సెలవు ప్రకటిస్తున్నామని, పరిస్థితి అదుపులోకి వచ్చాక పునఃప్రారంభిస్తామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు.

ఇది కూడా చదవండి:

Jagan: నేడు బెంగళూరు పర్యటనకు జగన్..

Updated Date - Jul 15 , 2024 | 02:53 PM