Home » Andhra Pradesh » Visakhapatnam
ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి పలు శాఖల అధికారులను ఆదేశించారు.
మండంలోని బాటజంగాలపాలెంలో ఆరు వరుసల జాతీయ రహదారికి సమీపంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు.
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయ భారతి తెలిపారు.
సహజసిద్ధ అందాల నడుమ కొండపై వెలిసిన అనంత వేంకటేశ్వరస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కొండను ఆనుకుని తాటిపూడి జలాశయం, చుట్టూ ప్రకృతి రమణీయ దృశ్యాలు పర్యాటకులను సైతం ఆకట్టుకుంటున్నాయి.
కూటమి ప్రభుత్వం రావడంతో రహదారులకు మోక్షం కలిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు జోరందుకున్నాయి. ప్రస్తుతం బొండాం పంచాయతీ పరిధిలో జయంతివలస నుంచి బొండాంకొత్తవలస వరకు రెండు కిలోమీటర్ల మేర రహదారి పనులను సుమారు కోటి రూపాయలతో చేపడుతున్నారు.
జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల(కేజీబీవీలు)పై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సమగ్ర శిక్ష విద్యా విభాగం పరిధిలో ఉండే కేజీబీవీలపై ఇతర విద్యాఖాకాధికారులు పర్యవేక్షించే అధికారం లేకపోగా, సమగ్ర శిక్షలో వాటిని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారి లేకపోవడం గమనార్హం.
జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ పాత్రుగుంట గ్రామానికి రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరకులు తెచ్చుకోవాలన్నా, పండిన పంటలను సప్పర్ల సంతకు తీసుకువెళ్లి విక్రయించాలన్నా గుర్రాలపైనే తరలించాల్సిన పరిస్థితి ఉంది.
వాల్తేరు రైల్వే డివిజన్లో ఆదివారం కలకలం రేగింది. లంచం తీసుకుంటూ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ముంబైలో సీబీఐ అధికారులకు చిక్కారనే వార్త డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు నగర వాసుల్లోనూ సంచలనం కలిగింది. డివిజన్ చరిత్రలో డీఆర్ఎం స్థాయి అధికారి సీబీఐకి పట్టుబడడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
వరిపై క్రిమికీటకాలు దాడి
తెలుగుదేశం పార్టీ గతంలో (2014-19) అధికారంలో వున్నప్పుడు అచ్యుతాపురాన్ని నగర పంచాయతీగా చేయాలని నిర్ణయించారు. ఇది ప్రతిపాదనల దశలో వుండగా వైసీపీ అధికారంలోకి వచ్చింది.. నగర పంచాయతీ ప్రతిపాదన మూలనపడింది. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా దీని గురించి పట్టించుకోలేదు. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అచ్యుతాపురం నగర పంచాయతీ ప్రతిపాదన తెరమీదకు వచ్చింది.