Home » Andhra Pradesh » Visakhapatnam
మండలంలోని సింహాద్రిపురం పంచాయతీలో డ్వాక్రా సభ్యుల రుణాల సొమ్మును స్వాహా చేసిన వారిపై డీఆర్డీఏ (వెలుగు) అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. బుధవారం సింహాద్రిపురం, పాతిక గ్రామాల్లో విచారణ చేపట్టిన డీఆర్డీఎ అధికారులు గురువారం కూడా ఆయా గ్రామాల్లో డ్వాక్రా సంఘాల సభ్యులను విచారించారు. ఎంత మేర నిధులు పక్కదారి పట్టాయన్నదానిపై వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
పెందుర్తి మండలం పురుషోత్తపురం బాలాజీనగర్లో ఓ బిల్డర్ రహదారిని ఆక్రమించి గ్రూపు హౌస్ నిర్మిస్తున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీప్రైవేటు ఆస్పత్రుల దోపిడీప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ
రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. లంకెలపాలెం రైల్వే గేటు వద్ద గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకొంది. దీనికి సంబంధించి దువ్వాడ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు అత్యున్నత టెక్నాలజీని అమలుచేస్తుండగా, సైబర్ నేరగాళ్లు అంతకుమించిన టెక్నాలజీని వినియోగిస్తూ ఒక క్లిక్తో అమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం.. ప్రజల సొమ్ముకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గ్రామాల్లోని రహదారులకు మహర్దశ పట్టింది. గత వైసీపీ పాలనలో ఐదేళ్లు ఎటువంటి అభివృద్ధికి నోచుకోని రోడ్లు కూటమి ప్రభుత్వం వచ్చాక సీసీ రోడ్లుగా దర్శనమిస్తున్నాయి.
రహదారి సౌకర్యం లేక మండలంలోని రూఢకోట పంచాయతీలో గల మారుమూల పెదకొండా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సౌకర్యం కల్పించాలని గత ఐదేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో గురువారం గ్రామస్థులంతా శ్రమదానంతో ఐదు కిలో మీటర్ల మేర మార్గం ఏర్పాటు చేసుకున్నారు.
సీలేరులో నిర్మించే 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ప్రతిపాదించిన భూములను గురువారం అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు రాహుల్ పాండే పరిశీలించారు.
రోగులను తరలించడానికి ఉన్న అంబులెన్సులను ఇతర పనులకు ఎట్టి పరిస్థిత్లుల్లోనూ వినియోగించవద్దని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ సూచించారు.
ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు అవకాడోపై పరిశోధనలు ప్రారంభించారు. గిరిజన ప్రాంతానికి అనువైన రకాలను ఎంపిక చేసేందుకు ప్రయోగాత్మక సాగు చేపడుతున్నారు. ఆరు దేశ, విదేశీ రకాల మొక్కలను బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుని ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేశారు.